Home /News /telangana /

Breaking : నల్లా.. నీళ్లలో కుళ్లిపోయిన శవం.. వాటర్‌ ట్యాంకు లోపల దారుణం..!

Breaking : నల్లా.. నీళ్లలో కుళ్లిపోయిన శవం.. వాటర్‌ ట్యాంకు లోపల దారుణం..!

water tank

water tank

Breaking : హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ప్రాంతలో దారుణం జరిగింది.. ప్రజలు తాగే నీళ్లలో కుళ్లిన శవం బయటపడింది... ( Dead body was found in water tank ) అదికూడా అతిఎత్తైన వాటర్ ట్యాంక్‌‌లో శవం కనబడడంతో జలమండలి సిబ్బంది షాక్‌కు గురయ్యారు.

ఇంకా చదవండి ...
    హైదరాబాద్ నగరం, ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రీసాలగడ్డలో జలమండలి వాటర్‌ ట్యాంక్‌లో మృతదేహం లభ్యమైంది. మృత దేహం కుళ్లిన దశలో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. మృతుడికి 25 సంవత్సరాల వయస్సు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.. ( Dead body was found in water tank ) కాగా రెండు రోజుల పాటు నీళ్లు రావని చెప్పిన అధికారులు ఆ ట్యాంకును శుభ్రపరిచేందుకు నేడు వెళ్లిన సిబ్బంది మృతదేహాన్ని గుర్తించారు. ట్యాంకు పై భాగంలోని గల మూత తొలగించిన సిబ్బందికి మృత దేహం కనిపించిందని చెబుతున్నారు..

    భయాందోళనలకు గురైన సిబ్బంది వెంటనే పై అధికారులతో పాటు స్థానిక పోలీసులకు సమాచారమివ్వడంతో శవాన్ని తొలగించారు. మరోవైపు ఘటనా స్థలికి చేరుకున్న క్లూస్‌ టీమ్‌, పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఎవరైనా హత్య చేసి వాటర్‌ ట్యాంక్‌లో పడేసి ఉంటారా? ( Dead body was found in water tank ) లేక ప్రమాదవశాత్తూ ఎవరైనా ట్యాంక్‌లో పడ్డారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే వాటర్ ట్యాంక్ మూత పెట్టి ఉండడం .. గత కొద్ది రోజులుగా ట్యాంకును క్లీన్ చేయకుండా ఉండడంతో హత్యా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..

    Gadwala : కేసిఆర్ డౌన్‌..డౌన్.. మందుబాబుల హల్‌చల్..ఆంధ్ర, తెలంగాణ బోర్డర్ వద్ద.. ధర్నా


    కాగా గత కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో నల్లా నీరు తాగుతున్న ప్రజలు కూడా నీళ్లు వాసన వస్తున్నాయని చెప్పడంతో పాటు మనిషికి సంబంధించిన అవశేషలు కూడా వస్తన్నాయని ఫిర్యాదు చేయడంతో.. అప్రమత్తమైన అధికారులు ( Dead body was found in water tank ) ఏదైనా.. ఎలుకలు ,లేదా పందికొక్కులు పైపులైనును ధ్వంసం చేసి అందులో చనిపోయి ఉంటాయనే అనే అనుమానంతో అధికారులు కింద ఉన్న పైపు లైనును తవ్వి చెక్ చేసినట్టు చెబుతున్నారు.


    kamareddy : పరిచయం ఉన్న మేస్త్రీతో కలిసి వెళ్లింది..కుళ్లిన శవంగా మారింది... !


    చివరకు వాటర్ ట్యాంకులోనే మనిషి శవం లభ్యం కావడంతో ఆ వాటర్ తాగిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు స్థానిక కార్పోరేటర్ తెలిపారు. ఇప్పటికే పలు అనారోగ్యాలతో సతమతమతవుతున్న ప్రజలు ప్రస్తుత సంఘటనతో షాక్‌లో ఉన్నట్టు చెప్పారు.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Drinking water, Hyderabad, Telangana

    తదుపరి వార్తలు