హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sad news : ఎస్‌ రాత పరీక్ష రాసింది .. ఫలితాలకు ముందే ఆమె తలరాత మారిపోయింది .. ఆ యువతి కథ చివరకు అలా ముగిసింది

Sad news : ఎస్‌ రాత పరీక్ష రాసింది .. ఫలితాలకు ముందే ఆమె తలరాత మారిపోయింది .. ఆ యువతి కథ చివరకు అలా ముగిసింది

 SI Candidate suicide

SI Candidate suicide

Sad news : ఆమెకు పోలీస్ అధికారి కావాలనే కోరిక. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి కష్టపడి చదివింది. ఆడపిల్ల అయినప్పటికి పట్టుదలతో తల్లిదండ్రులను ఒప్పించి హైదరాబాద్‌లో ట్రైనింగ్ తీసుకుంది. ఎస్ఐ రాత పరిక్ష ఆమె తల రాతను మార్చుతుందని ఊహించలేకపోయింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India

(P.Mahendar,News18,Nizamabad)

ఆమెకు పోలీస్ అధికారి కావాలనే కోరిక. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి కష్టపడి చదివింది. ఆడపిల్ల అయినప్పటికి పట్టుదలతో తల్లిదండ్రులను ఒప్పించి హైదరాబాద్‌(Hyderabad)లో ట్రైనింగ్(Training) తీసుకుంది. ఎస్ఐ రాత పరిక్ష(SI Written Exam) ఆమె తల రాతను మార్చుతుందని ఊహించలేకపోయింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ... జీవితంలో అగ్రస్థానాన్ని చేరుకోవాలనే విషయాన్ని మర్చిపోయి తనలోని అనుమానం, అసంతృప్తితో తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కామారెడ్డి(Kamareddy)జిల్లాలో ఎస్‌ఐ కావాల్సిన యువతి పరీక్ష రాసిన తర్వాత తీసుకున్న నిర్ణయం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

Love Cheater : ప్రియురాలికి అబార్షన్ చేయించి మరో యువతితో పెళ్లి .. పీటల మీదే చుక్కలు చూపించిన యువతిఎస్‌ఐ కావాల్సిన యువతి..

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం కోరేగావ్ గ్రామానికి చెందిన పంచశీల అనే 22సంవత్సరాల యువతి పోలీస్ ఇన్స్పెక్టర్ కావాలని కలలు కనింది. తన కలను సాకారం చేసుకునేందుకు పట్టుదలతో హైదరాబాదులోని ఓ కోచింగ్ సెంటరులో ఎస్సై పరీక్ష కొరకు కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అయింది. ఈనెల 7వ తేదిన‌ నిర్వహించిన ఎస్సై రాత పరీక్ష రాసింది. అయితే ఆ ప‌రిక్ష‌లో త‌ను అనుకున్నాంత బాగా రాయ‌లేక‌ పోయాని...  పరీక్షలో ఫెయిల్ అవుతానేమని మనస్తాపానికి గురైంది.

తనువు చాలించిన యువతి..

మంగళవారం హైద‌రాబాద్ నుంచి బ‌స్సులో బ‌య‌లు దేరిన పంచశీల దారి మ‌ద్య‌లో బిక్క‌నూర్ మండ‌లం జంగంప‌ల్లి గ్రామం బ‌స్టాప్ లో దిగింది. అదే గ్రామంలోని పెద్ద చెరువులో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అయితే  యువతి ఆత్మహత్యకు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడింది. అయితే పంచశీల మాటలతో వెంటనే కుటుంబ స‌భ్యులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. పోలీసులు యువతి సెల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా జంగంపల్లి పెద్ద చెరువు వద్ద గాలింపు చర్యలు చేపట్టారు.

Crime news : ఓ సైంటిస్ట్ చీకటి దందా గుట్టురట్టు .. ఇంట్లోనే ఆ దుకాణం పెట్టిన కేటుగాడులక్ష్యాన్ని చేరుకోలేననే బాధతో..

చెరువులో గజఈతగాళ్లతో గాలింపు చేపట్టడంతో మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం కొరకు మృతదేహన్ని కామారెడ్డి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బిక్కనూర్ పోలీసులు తెలిపారు. కేవలం తన లక్ష్యాన్ని చేరుకోలేమో అనే సందేహంతో ...పరీక్షల్లో మంచి మార్కులు రావనే మనస్తాపంతో ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడంతో పంచశీల కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఒక్కసారి ప్రయత్నించి విఫలమైతేనే జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదని..కని, పెంచిన తల్లిదండ్రుల కోరికలు, తీర్చడానికి అనేక ప్రయత్నాలు చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని పోలీసులు యువతకు సూచిస్తున్నారు.

First published:

Tags: Mancherial, Telangana News, Woman suicide

ఉత్తమ కథలు