హోమ్ /వార్తలు /తెలంగాణ /

Suicide: ప్రేమించిన యువకుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్లో యువతి ఆత్మహత్యాయత్నం.. చివరకు పోలీసులు 

Suicide: ప్రేమించిన యువకుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్లో యువతి ఆత్మహత్యాయత్నం.. చివరకు పోలీసులు 

Suicide: ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్ స్టేషన్ లో ప్రేమించిన యువకుడు మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పోలీస్ స్టేషన్ లోనే పురుగు మందు డబ్బా తెచ్చుకొని పురుగు మందు తాగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

  ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన దరిపల్లి రాజు అనే యువకుడు దాదాపు ఐదు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే ఈ మధ్యన తనను పెళ్లి చేసుకోవాలని ఎంత చెప్పినా వినకుండా ముఖం చాటేసుకొని తిరుగుతున్నట్లు ఆమె ఆరోపించింది.

  అతడితో తనకు వివాహం జరిపించాలని గత నెల 25న ముదిగొండ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. తనకు తల్లిదండ్రులు లేరని తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు పట్టించుకోలేదని యువతి ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆమె మనస్తాపం చెందింది. ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించడం.. పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోకపోవడంతో ఆవేదన చెందింది. దీంతో మంగళవారం ముదిగొండ పోలీసల్ స్టేషన్ కు పరుగు మందు డబ్బా పట్టుకొని వచ్చింది.

  పోలీస్ స్టేషన్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీస్ స్టేషన్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతిని చికిత్స నిమిత్తం పోలీసులు వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి నుంచి ముదిగొండ పోలీస్ స్టేషన్ కు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ముదిగొండ పోలీసులు చెప్పడం గమనార్హం. అయితే చికిత్స పొందుతున్న ఆమె తనకు న్యాయం చేయాలని కోరింది.

  First published:

  Tags: Crime, Crime news, Khammam, Mudigonda, Police station, Suicide, Women commits suicide

  ఉత్తమ కథలు