Home /News /telangana /

YOUNG WOMAN ARRESTED IN THEFT CASE IN HYDERABAD VRY

Hyderabad : జాలిపడి యువతికి.. లిఫ్టు ఇచ్చాడు..! కాని ఆమె... ఏం మాయ చేసిందో తెలుసా..?

ప్రతీకాాత్మక చిత్రం

ప్రతీకాాత్మక చిత్రం

Hyderabad : రాత్రి పూట రోడ్డుమీద ఒంటరిగా ఉన్న ఓ యువతి అడిగితే.. జాలిపడి లిఫ్టు ఇస్తే.. మాటల్లో పెట్టి మాయ చేసింది. బైకు మీద ఉండగానే.. బంగారు గోలుసును ఎత్తుకెళ్ళింది. దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు కిలాడి లేడిని అరెస్ట్ చేశారు.

ఇంకా చదవండి ...
    దొంగతనాలు చేసేవారికి, మనుష్యుల్ని మాయలు చేసి డబ్బుదోచుకునేవారికి ఎదుటి వ్యక్తుల మానసిక పరిస్థితే కారణం..ఇబ్బందుల్లో ఉన్నారని నమ్మి వెళితే.. ఆ నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టి దోపిడికి దిగుతారు.. నైస్‌గా మాటల్లో పెట్టి సహాయం చేసిన వారికే ద్రోహం చేస్తారు.. ఇలా ఓ మహిళా దొంగ అర్థరాత్రి ఒంటరిగా ఉన్నానంటూ.. లిఫ్టు అడిగి ఏకంగా ఓ కానిస్టేబుల్ నుండే బంగారు గొలుసు కొట్టెసింది. అయితే చివరికి ఆ కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసును చేధించి యువతిని కటకటాలపాలు చేశారు.

    వివరాల్లోకి వెళితే.. సన్‌సిటీలో నివాసం ఉండే ఈశ్వర్‌ ప్రసాద్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌‌గా విధులు నర్వహిస్తున్నాడు..కాగా ఈ నెల 12న రాత్రి 8:30 సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా గ్రీన్‌ల్యాండ్స్‌ వద్ద ఓ యువతి లిఫ్ట్‌ అడగగా ఆమెకు లిఫ్ట్‌ ఇచ్చాడు.

    ఇది చదవండి :కేటీఆర్ ఒక మంచి నటుడు.. ఓకే ఇది నేను మనసులో పెట్టుకుంటా!


    రాత్రి 9 గంటలకు ఆమెను పంజగుట్టలో దింపి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఆ యువతి కానిస్టేబుల్‌ను మాటల్లోకి దింపింది.దీంతో కానిస్టేబుల్ మెడలో ఉన్న గొలుసును కొట్టెసింది. అయితే ఇది గమనించని కానిస్టేబుల్ నేరుగా ఇంటికి వెళ్లి.. స్నానం చేసే సమయంలో తన బంగారు గొలుసు మాయమైనట్లు తెలుసుకున్నాడు. వెంటనే తాను విధులు నిర్వహించిన స్థానానికి వెళ్లి వెతికాడు..కాని అక్కడ కూడా లేకపోవడంతో.. దీంతో వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు..కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సీసి కెమెరాలను పరిశీలించి నిందుతురాలు ఎవరనే విషయాన్ని కనుకొన్నారు.. అయితే ట్విస్ట్ ఏటంటే.. దొంగతనం చేసిన మహిళ.. మరోసారి మహంకాళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కూడా ఇలాంటీ ప్రయత్నం చేయడంతో.. ఆ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అసలు విషయం ఒప్పుకుంది. కాగా ఆమె ట్రాన్స్‌జెండర్ అని బెంగళూరులో ఉంటూ దొంగతానల కోసమే హైదరాబాద్‌కు వచ్చి వెళ్లిపోతుందని పోలీసులు వివరించారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు