Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం.. నిండు ప్రాణం బలి.. 45 మంది హింసించారంటూ సూసైడ్ నోట్.. పూర్తి వివరాలను తెలుసుకోండి..

ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం.. నిండు ప్రాణం బలి.. 45 మంది హింసించారంటూ సూసైడ్ నోట్.. పూర్తి వివరాలను తెలుసుకోండి..

అతని చావుకు కారణమైన వారిలో ఇద్దరు

అతని చావుకు కారణమైన వారిలో ఇద్దరు

Khammam: ప్రవేటు చిట్టీల మోసానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఏభై లక్షల మేర జరిగిన మోసానికి ఏంచేయాలో అర్థం కాక.. పోలీసులు పట్టించుకోక.. హామీగా ఇస్తామన్న ఆస్తిని సైతం లాక్కోగా దిక్కుతోచని స్థితిలో ఒక చిన్నకారు వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబం దిక్కులేని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పూర్తి వివరాలివే..

ఇంకా చదవండి ...

(జి. శ్రీనివాసరెడ్డి, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా) 

ప్రవేటు చిట్టీల మోసానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఏభై లక్షల మేర జరిగిన మోసానికి ఏంచేయాలో అర్థం కాక.. పోలీసులు పట్టించుకోక.. హామీగా ఇస్తామన్న ఆస్తిని సైతం లాక్కోగా దిక్కుతోచని స్థితిలో ఒక చిన్నకారు వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబం దిక్కులేని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. సూసైడ్‌ నోట్‌లో అతను పేర్కొన్న పేర్లు ఇప్పుడు భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో సంచలనంగా మారాయి. స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ ప్రోద్బలంతోనే తనకు చిట్టీల డబ్బులు ఇవ్వకుండా.. ప్రతిగా ఇస్తామన్న ఆస్తిని ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్నారని సూసైడ్‌ నోట్‌లో మృతుడు పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం అతని సూసైడ్‌ నోట్‌ కొత్తగూడెంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నోట్‌లో పలువురు పోలీసు అధికారులు, స్థానిక రాజకీయ నాయకులు, ఇంకా పలువురు వ్యాపారుల పేర్లను మృతుడు పేర్కొనడంతో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారం అండ చూసుకుని సామాన్యులపై ఎలాంటి జులుం చేస్తున్నారన్న విషయం తేటతెల్లమవుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

దీనిపై సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, తెరాస నేత జలగం వెంకటరావు డిమాండ్‌ చేయడంతో ఈ ఘటనకు మరింత ప్రాధాన్యం వచ్చింది. మలిపెద్ది వెంకటేశ్వరరావు ఓ చిన్న పాటి వ్యాపారి. పాల్వంచలోని జయమ్మకాలనీలో ఉంటాడు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ.. తన తల్లికి వచ్చే సింగరేణి పెన్షన్‌తో బతుకీడుస్తున్నాడు. బొల్లోరిగూడేనికి చెందిన తనకు దగ్గరి బంధువైన నందిగం భానుకుమార్‌ వద్ద 2012లో రూ.25 లక్షల చిట్టీలలో సభ్యునిగా చేరాడు. 2016 దాకా క్రమం తప్పకుండా చిట్టీ మొత్తం చెల్లిస్తూ.. చివరి దాకా పాడుకోకుండా దాచుకున్నాడు. 2016లో తనకు రెండు చిట్టీల ద్వారా రావాల్సిన రూ.50 లక్షల మొత్తాన్ని ఇవ్వాలని అడిగాడు. ఆర్ధిక ఇబ్బందులు ఉండడంతో కొంతకాలం ఆగాలంటూ భానుప్రసాద్‌ కోరడంతో.. వెంకటేశ్వరరావు వేచిచూశాడు. ఇలా ఎంతకాలం ఉన్నా భానుకుమార్‌ డబ్బు చెల్లించకపోగా.. తమపై చట్టప్రకారం ఎలాంటి చర్యలకు ఉపక్రమించవద్దని కోరుతూ.. ఇవ్వాల్సిన డబ్బులకు ప్రతిగా బొల్లోరిగూడెంలో ఉన్న 747 చదరపు గజాల స్థలాన్ని ఇస్తామని ఒప్పుకున్నారు. కానీ రిజిస్ట్రేషన్‌కు మాత్రం తిప్పుతూఉన్నట్టు మృతుడు లేఖలో పేర్కొన్నారు.

అయితే భానుకుమార్‌ ఇచ్చిన స్థలంలో రూ.15 లక్షల వ్యయంతో ఇల్లు నిర్మించుకుని ఉంటుండగా.. తనకు ఇచ్చిన స్థలాన్నే మరికొందరు చిట్టీల బాధితులకు రాసిచ్చినట్టు వెలుగుచూసింది. దీంతో తనకు జరిగిన మోసంపై వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని లేఖలో పేర్కొన్నాడు. తిని తినకుండా దాచిపెట్టుకున్న మొత్తాన్ని చిట్టీలు కట్టి మోసపోయానని.. దానికింద ఇస్తానన్న స్థలాన్ని కూడా చాలామందికి హామీగా పెట్టారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని.. పైగా తనపైనే దౌర్జన్యం చేస్తూ వేధింపులకు పాల్పడ్డారని మృతుడు తన లేఖలో ఆరోపించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సంచలనం సృష్టిస్తున్న ఈ సూసైడ్‌ నోట్‌లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ సహా పలువురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు, ఇంకా ఇతర వ్యక్తుల పేర్లను మృతుడు పేర్కొనడం గమనార్హం. ఇలా 45 మంది తనను మానసికంగా వేధింపులకు గురిచేసి, తాను బలవర్మణానికి పాల్పడే పరిస్థితులు సృష్టించారని మృతుడు భద్రాద్రి ఎస్పీకి రాసిన సూసైడ్‌ నోట్‌లో మెన్షన్‌ చేశారు.

తన భర్త వెంకటేశ్వరరావు మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని అతని భార్య శ్రావణి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా మూడు గంటలపాటు తీసుకోలేదని, ఆనక బలవంతంగా తీసుకున్నా రశీదు ఇవ్వలేదని బాధిత కుటుంబం వాపోతోంది. కేవలం ఎమ్మెల్యే కుమారుడి వత్తిడితోనే పోలీసులు ఇలా చేస్తున్నారని, తన భర్త మృతికి ఎమ్మెల్యే కుమారుడు రాఘవతో పాటు ఇంకా పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యులని ఆమె ఆరోపిస్తున్నారు. తనకు, తన బిడ్డలకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతున్నారు. దీనిపై తెరాసలోనే మరో వర్గమైన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు సీరియస్‌గా స్పందించారు. సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

First published:

Tags: Attempt to suicide, Bhadradri kothagudem, Crime news, Khammam