హోమ్ /వార్తలు /తెలంగాణ /

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య..

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య..

తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య

తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య

ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నల్గొండ - ఖమ్మం -వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న సంచలనంగా మారారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు తీన్మార్ మల్లన్న. అయితే మల్లన్న మరణాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం లంకలపల్లికి గ్రామానికి చెందిన ఏర్పుల శ్రీశైలం(21)  ఆదివారం ఉదయం పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో అతడు తుదిశ్వాస విడిచాడు. ఇక, ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే శ్రీశైలం మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు.

ఇక, శ్రీశైలం తీన్మార్‌ మల్లన్నకు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. మల్లన్న నిర్వహించిన పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. ఇక, ఈ విషయం తెలుసుకున్న తీన్మార్ మల్లన్న.. శ్రీశైలం ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధకరమని అన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇక, నల్గొండ - ఖమ్మం -వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చివరి వరకు తీవ్ర ఉత్కంఠగా సాగింది. అంతిమంగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించినప్పటికీ.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న గట్టి పోటీ ఇచ్చి ఓటమి పాలయ్యారు. ఆయనకు ఎటువంటి క్యాడర్ లేకపోయిన తన పాదయాత్రతో జనాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీపై తీవ్రంగా విరుచుకుపడేవారు. ఇలా యువతలో మంచి కొందరు పట్టభద్రులను ఆయన చైతన్యపరచగలిగారు. ఈ క్రమంలోనే ఆయన భారీగా ఓట్లు సాధించారు.

తన ఓటమిపై స్పందించిన మల్లన్న.. దొంగ ఓట్లు, నోట్ల కట్టలతో తనను చట్టసభలకు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. జాతీయ, రాష్ట్ర పార్టీలను కాదని సామాన్యుడినైన తనను పట్టభద్రులు మద్దతుగా నిలిచారని తెలిపారు. ప్రగతిభవన్‌ గోడలు బద్దలుకొట్టే రోజులు వస్తాయని.. అప్పటివరకు తన ఉద్యమం ఆపనని అన్నారు.

First published:

Tags: Nalgonda, Telangana, Telangana mlc election