హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: హైదరాబాద్ లో ఘోరం.. మద్యం మత్తులో కారును నడిపిన యువకుడు.. డివైడర్ ను ఢీకొట్టి మరీ..

Hyderabad: హైదరాబాద్ లో ఘోరం.. మద్యం మత్తులో కారును నడిపిన యువకుడు.. డివైడర్ ను ఢీకొట్టి మరీ..

రోడ్డు ప్రమాదానికి గురయిన కారు (Photo Courtesy: Twitter)

రోడ్డు ప్రమాదానికి గురయిన కారు (Photo Courtesy: Twitter)

వనస్థలిపురంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఓ యువకుడు కారును నడపడం వల్లే ఈ ఘోరం జరిగింది. అతి వేగంగా వస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టి మరో పక్కకు దూసుకెళ్లింది.

  హైదరాబాద్ పరిధిలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువయిపోతున్నాయి. అతి వేగమే దీనికి ప్రధాన కారణం కాగా, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం కూడా ఈ దారుణాలకు మరో కారణం అవుతోంది. తాజాగా వనస్థలిపురంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఓ యువకుడు కారును నడపడం వల్లే ఈ ఘోరం జరిగింది. అతి వేగంగా వస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టి మరో పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఓ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గౌతమ్ అనే యువకుడు సందీప్, మరో స్నేహితుడితో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. సాగర్ రోడ్డు నుంచి ఇబ్రహీంపట్నం వైపుగా వెళ్తున్నాడు. కారు వనస్థలిపురం వద్దకు చేరుకోగానే ఘోరం జరిగింది. మద్యం మత్తులో అతడు ఉండటంతో కారు అదుపు తప్పింది.

  ముందుగా కారు అదుపుతప్పి ట్రాఫిక్ సిగ్నల్ స్తంబాన్ని ఢీకొట్టాడు. ఆ తర్వాత డివైడర్ పై నుంచి మరో పక్కకు కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. మరో యువకుడు భయంతో ఆ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. కారు నడిపిన గౌతమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  ఇది కూడా చదవండి: హైదరాబాద్ లోని ఓ యువతిపై అమెరికా నుంచి తెలుగు టెకీ ఫిర్యాదు.. ఆమె గురించి ఆరా తీసిన పోలీసులకే..

  కాగా, హైదరాబాద్ లో అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత, తెల్లవారుజామున సమయాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. విపరీతంగా మద్యం తాగి యువత వాహనాలను నడుపుతోంది. మితిమీరిన వేగం కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు.

  ఇది కూడా చదవండి: నా భర్తను చంపేశావా? పని పూర్తి చేసేశావా?.. అంటూ ఫోన్ చేసి మరీ అడిగిన భార్య.. అసలేం జరిగిందంటే..

  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Bus accident, Car accident, Crime news, Crime story, Fire Accident, Hyderabad

  ఉత్తమ కథలు