Home /News /telangana /

YOUNG MAN KILLED OF HIS A GRAND FATHER HITTING BY STONE VRY KNR

Jagityala : తాతనే రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు..విపరీతంగా కొట్టాడు.. ఆ తర్వాత.. ( వీడియో.)

రోడ్డుపై తాతను దారుణంగా కొడుతున్న మనవడు

రోడ్డుపై తాతను దారుణంగా కొడుతున్న మనవడు

Jagityala : ముసలోడని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు నడిరోడ్డుపై కొట్టాడు.. ఎనబై సంవత్సరాల వయస్సులో ఎదిరించలేని ఆ వృద్దుడు దెబ్బలకు తాళలేక ప్రాణాలు ( Death ) విడిచాడు.. అయినా వదలని ఆయన మనవడు శవాన్ని బైకుపై ( Bike ) వేసుకుని వెళ్లిపోయాడు..

ఇంకా చదవండి ...
    మతిస్థిమితం ( Mental Disorder ) కోల్పోయి కొందరు దారుణంగా ప్రవర్తిస్తుంటే మరికొందరు వారిని చూస్తూ మౌనంగా ఉంటున్నారు. దీంతో తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో ఓ మనవడు తన తాతను నడిరోడ్డుపై పడేసి విపరీతంగా కొట్టాడు.. అంతటితో ఆగకుండా ఈడ్చుకుంటూ పరుగెత్తాడు. అయితే ఊరు నడిబొడ్డులో ఇదంతా జరుతున్నా గ్రామస్థులు ఎవరు పట్టించుకోని పరిస్థితి. అలా మనవడు తాతను కొడుతుంటే ఎవరి దారిన వారు వెళ్లారు..

    దీంతో అసలే తాను ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితి దీనికి తోడు ఎవరు ఆపలేక పోవడంతో ఓ మనవడు తన తాత ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత బలవంతంగా లేపి తన బైకుపై ముందు పడుకొబెట్టుకుని వెళ్లిపోయాడు.. అయితే ఇదంతా చోద్యం చూస్తూ గ్రామస్థులు అలాగే ఉండిపోయారు. తీరా ఆ ముసలాయన మనవడు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక విలవిలలాడుతుంటే చివరకు ఓ బండరాయితో కొట్టి ప్రాణాలు తీసిన ఘటన జగిత్యాల జిల్లా ( Jagityala) మేడిపల్లి మండలం కల్వకోట గ్రామంలో చోటు చేసుకుంది.

    Kamareddy : మద్యం మత్తులో కారుపై యూరిన్.. ఏమిటని ప్రశ్నిస్తే.. తుపాకి గురి .. ఆ తర్వాత

    మృతుడు మల్లయ్యను ( 80 )ఆయన మనవడు (24) చందు రోడ్డుపై కొట్టి చంపాడు.. కాగా చందుకు గత కొద్ది రోజులుగా మతిస్థిమితం లేనట్టు గ్రామస్థులు తెలిపారు. అయితే బైకును నడుపూతూ రోడ్డుపై సృష్టించిన నానా హంగామా స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు చందుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

    ఇటివల మానసిక స్థితి సరిగా లేని వారు చాలా దారుణంగా వ్వవహరిస్తున్నారు. ఇలా నిన్న పెద్దపల్లి ఓ అక్క తన చెల్లెలు చనిపోయి నాలుగు రోజులు గడుస్తున్నా.. బయటకు ఎవరికి చెప్పకుండా ఆ శవం పక్కనే కూర్చుని ఏడ్చింది. ఇలా నాలుగు రోజులుగా చుట్టుపక్కల వారికి కూడా తెలియకుండా చేసింది.అయితే చివరికి ఆ శవం కుళ్లి దుర్వాసన రావడంతో విషయం బయటికి తెలిసింది. అయితే గతంలో కూడా వాళ్ల అమ్మ చనిపోయినప్పుడు కూడా శవంతోనే రెండు రోజుల పాటు ఇద్దరు అక్కచెల్లెల్లు శవంతో సహవాసం చేశారు. మరోవైపు నల్గొండ జిల్లాలో మొండెం లేని ఓ శవం కలకలం రేపిన విషయం తెలిసిందే.. హత్యకు గురైన జై సింగ్ నాయక్‌ కూడా గత కొద్ది రోజులుగా మతిస్థిమితం కొల్పోయి తిరుగుతున్నట్టు స్థానికులు తెలిపారు..

    Encounter : తెలంగాణ సరిహద్దులో ఎన్‌కౌంటర్ మావోల మృతి .. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం..

    ఇలా మానసిక స్థితి సరిగా లేని వారు ఎప్పుడు ఏం చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది తమకు తాము చనిపోతుండగా మరికొంతమంది ఇలా వ్యవహరిస్తుండడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Karimnagar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు