హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nizamabad: పంజరాల్లో నాటు కోళ్ల పెంపకం.. ల‌క్ష రూపాయ‌ల‌కి పైగా ఆదాయం

Nizamabad: పంజరాల్లో నాటు కోళ్ల పెంపకం.. ల‌క్ష రూపాయ‌ల‌కి పైగా ఆదాయం

నాటు కోళ్ల పెంపకం

నాటు కోళ్ల పెంపకం

Nizamabad: నాటు కోళ్లను పెంచుతూ.. అన్ని ఖర్చులుపోగా.. నెలకు లక్షకు పైగా ఆదాయం పొందుతున్నారు. పందెం కోళ్ల అమ్మితే.. భారీ స్థాయిలో ఆదాయం వస్తుందని చెబుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Nizamabad

(పి.మ‌హేంద‌ర్, న్యూస్ 18 తెలుగు, నిజామాబాద్ జిల్లా)

స్వయం ఉపాధి పొందేందుకు ఒక్కొక్క‌రు  ఒక్కొక్క దారిలో వెళ్తారు. కొందరు వ్యవసాయం చేస్తే.. మరికొందరు వ్యాపారం చేస్తారు. ఎంచుకునే దారులు వేరు కానీ డబ్బులు సంపాదించడమే అందరి లక్ష్యం. నిజామాబాద్ జిల్లా చెందిన దశరథ్ ఉపాధి కోసం భిన్నమైన పంథా ఎంచుకున్నారు. రెండేళ్లుగా పంజరంలో నాటు కోళ్లు, గిన్నె కోళ్లు, పందెం కోళ్లు పెంచుతూ భారీగా ఆదాయం పొందుతున్నాడు.

నిజామాబాద్ జిల్లా ఏడ‌ప‌ల్లి మండ‌ల కేంద్రానికి చెందిన ధ‌శ‌ర‌థ్ కారు డ్రైవ‌ర్‌గా ప‌ని చేసి కుటుంబాన్ని పోషించుకునే వాడు. అయితే 2020 రోడ్డు ప్రమాదంలో దశరథ్ కాలు విరిగింది. డ్రైవింగ్ చేయ‌డం కష్టం కావ‌డంతో స్నేహితులు కోళ్ల ఫారమ్ పెట్టుకొమ్మని స‌ల‌హ ఇచ్చారు. ఆ తర్వాత నాటు కోళ్ల పెంపకంపై అధ్యయనం చేశారు. విజయవాడ నుంచి సీడ్ తెచ్చి కోళ్ల పెంపకం ప్రారంభించారు. పంజ‌రంలో నాటు కోళ్లు, గిన్నే కోళ్లు, పందెం కోళ్లను పెంచుతున్నాడు.

Telangana: ఫ్రీ..:ఫ్రీ..ఫ్రీ.. మటన్ కొంటే చికెన్ ఉచితం.. అదిరిపోయే ఆఫర్.. ఎక్కడంటే.

నిజామాబాద్ జిల్లా అంక‌పూర్‌లో నాటు కోళ్లుకు మంచి గిరాకి ఉంది. అక్కడ ప్ర‌తి రోజు 6 వందలకు పైగా నాటు కోళ్లు అమ్ముడవుతుంటాయి. వాటికి అంత డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో దశరథ్ స్థానికంగా వాటిని విక్రయించి.. మిగిలిన వాటిని విజయవాడకు ఎగుమతి చేస్తున్నారు. జాగ్రత్తలు పాటించి వ్యాధుల బారిన పడకుండా చూసుకుంటే స్థిరమైన ఆదాయం పొందొచ్చని

దశరథ్ చెబుతున్నారు.

Nizamabad: మూగబోయిన గొంతు 12ఏళ్ల త‌రువాత ప‌లికింది.. అద్భుతమంటే ఇదే..

'' నాకు 2020లో నాకు కాలు విరిగింది. నా స్నేహితులు కోళ్ల పెంప‌కం చేపట్టాలని సలహా ఇచ్చారు. విజయవాడ దగ్గర కంకిపాడు గ్రామం నుంచి కొన్ని పెట్ట‌లు తీసుకొచ్చాం. కొక్కేరా, కోడి కాకి, కాకి డేగ, నెమలి ఇలాంటి ర‌కాల బ్రీడ‌ర్స్ తీసుకు వ‌చ్చాను. పందెం కోళ్లు ఇప్పటికే 15 వ‌ర‌కు రెడీగా ఉన్నాయి. వీటి ధర ఒక్కొక్కటి రూ.25 నుంచి రూ.30వేలకు ఉంటుంది. గ‌త సంక్రాంతికి రెండు ల‌క్ష‌ల పందెంలో గెలిచిన కోడిని రూ.40 వేల‌కు కొన్నాను. దాని బ్రీడ్ ఇప్పుడు సిద్ధమవుతోంది. ముఖ్యంగా వానాకాలం, వేసవిలో ప్రత్యేక దృష్టి పెట్టాలి.'' అని దశరథ్ పేర్కొన్నారు.

దశరథ్ నాటు కోడి సీడ్ కోసం రూ.80 వేలు ఖర్చు చేశారు. 20 పంజరాల తయారీకి రూ.28 వేలు వెచ్చించారు. దాణా కోసం ప్రతినెల రూ. 5 వేల వరకు ఖర్చు అవుతుంది. ఆ కోళ్లు పెట్టే గుడ్లతో సొంతంగా సీడ్‌ను తయారు చేసుకోవడం వల్ల మరింత లాభం ఉంటుంద‌ని చెబుతున్నారు దశరథ్. ఆదాయం ఆరునెల‌ల‌కు ఖ‌ర్చులు పోను ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు వ‌స్తుద‌ని తెలిపారు. పందెం కోళ్లు అమ్మితే.. భారీ మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

First published:

Tags: Business, Business Ideas, Nizamabad, Telangana

ఉత్తమ కథలు