Home /News /telangana /

YOUNG MAN DEATH WHILE SPEKING ON MOBILE WHILE CHARGING VRY

Hyderabad : చార్జీంగ్ పెట్టి ఫోన్ మాట్లాడాడు.. ఫోన్ పేలింది.. ఆ తర్వాత

మృతి చెందిన యువకుడు

మృతి చెందిన యువకుడు

Hyderabad : చార్జింగ్ పెట్టిన ఫోన్ పేలి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

    ఫోన్లను చార్జీంగ్ పెట్టి మాట్లడకూడదని హెచ్చరికలు ఉన్నా కొంతమంది వాటిని పెడచెవిన పెడుతున్నారు. దీంతో వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. ఈ క్రమంలోనే సెల్‌ఫోన్‌లు పేలి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో యువకుడు తన నిర్లక్ష్యంతో ప్రాణాలు కొల్పోయాడు.. ఫోన్ చార్జీంగ్ పెట్టి మాట్లాడుతుండగా ఫోన్ పేలి మృత్యువాత పడ్డాడు.

    స్థానిక శంకర్ పల్లి ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఆసోం రాష్ట్రానికి చెందిన భాస్కర్ అనే (20) యువకుడు బతుకుదెరువు కోసం వచ్చి శంకర్ పల్లిలో నివాసం ఉంటున్నాడు. ఎలక్ట్రిషియన్‌గా పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి తన ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడాడు.. దీంతో ఫోన్ ఒక్కసారిగా షాక్ తగిలి పేలి పోయింది... దీంతో భాస్కర్ చేతులతో పాటు చెవుల వద్ద కాలిపోయింది. దీంతో విషయం తెలుసుకున్న స్నేహితులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. అప్పటికే భాస్కర్ ప్రాణాలు వదిలినట్టు పోలీసులు తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hyderabad, Mobiles

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు