హోమ్ /వార్తలు /తెలంగాణ /

Live suicide : లక్షలు ఖర్చు పెట్టిన దక్కని ప్రియురాలి ప్రేమ.. ఫేస్‌బుక్ లైవ్.. తో యువకుడు ఆత్మహత్య...

Live suicide : లక్షలు ఖర్చు పెట్టిన దక్కని ప్రియురాలి ప్రేమ.. ఫేస్‌బుక్ లైవ్.. తో యువకుడు ఆత్మహత్య...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Live suicide : ప్రేమించానని చెప్పిన యువతి చివరకు కులం పేరుతో దూరం పెట్టడడంతో పాటు కుటుంబ సభ్యులు కేసులు పెట్టి వేధించడంతో ఓ యువకుడు ఫేస్‌బుక్‌ లైవ్ పెట్టి (facebook live ) మరి ఆత్మహత్యకు ( suicide ) పాల్పడ్డాడు.

  ప్రేమ పేరుతో  ( love ) దగ్గరయిన ఓ యువకుడు చివరకు ఆ ప్రేమికురాలు నిరాకరించడంతోపాటు కుటుంబ సభ్యులు సైతం వ్యతిరేకించడంతో ఆత్మహత్య తో ప్రాణాలు  తీసుకున్నాడు. ( Young man suicide ofter denay of his love ) మనస్పూర్తిగా ప్రేమించిన యువకుడు ఆ యువతి అనారోగ్యానికి గురైనప్పుడు తాను స్వంతగా మూడు లక్షల రూపాయలు ఖర్చుపెట్టాడు. తనకు కాబోయో భార్య అని నమ్మి పూర్తిగా సహకరించాడు. అయితే ఆమె అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత సీను రివర్స్ అయింది. ఇద్దరి ప్రేమ విషయంలోకి పెద్దలు ఎంటర్ అయ్యారు. కులం పేరుతో బ్లాక్ మెయిల్ చేసి ఇద్దరిని దూరం చేసే ప్రయత్నం చేశారు.

  వివరాల్లోకి రాజన్న సిరిసిల్ల జిల్లాకు తంగళ్లపల్లి మండలం బస్వాపూర్కు చెందిన గొడిసెల దిలీప్ ( 23 ) , చింతల ఠాణా గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు . ( Young man suicide ofter denay of his love ) అయితే ఆ యువతి ఇటివల అనారోగ్యానికి గురి కావడంతో దిలీప్ మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సాధారణ స్థితికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత సీను రివర్స్ అయింది. ఈ క్రమంలోనే యువతిని ప్రేమ పేరుతో దగ్గర కావడం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో దిలిప్‌పు కులం పేరుతో దూషించింది. తన కూతురును ప్రేమించడం ఇష్టం లేని తల్లిదండ్రులు యువతికి సైతం మాయమాటలు చెప్పి సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో ( Siricilla police station ) ఫిర్యాదు చేయించారు. ఆ తర్వాత వీరి ఇద్దరి బంధానికి స్థానిక పెద్దలతో పాటు, సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కూడా తోడయ్యారు. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి యువకుడి మొబైల్‌లో దిగిన ఫోటోలు డిలీట్ చేయించారు. అనంతరం స్టేషన్‌కు పిలిపించే ప్రయత్నం చేయడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం అరెస్ట్ చేశారు.

  ఇది చదవండి  : స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా .. ఇటివలే మనవరాలి పెళ్లి.. హాజరైన ఇద్దరు సీఎంలు


  దీంతో మనస్థాపం చెందిన దిలీప్ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా జరిగిన విషయాన్ని చెప్పాడు. తనపై తప్పుడు కేసులు పెట్టడడంతోపాటు రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరించినట్టు చెప్పాడు. ఇందుకోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. అయితే పోలీసుల వాదన( Face book live ) మరోలా ఉంది పోలీసులు విచారణ కోసం కాల్ చేస్తే తమనే బెదిరించాడని అందుకే ఆయనపై కేసు నమోదు చేశామని , కొట్టడడం గాని బెదిరింపులకు గురి చేయడం గాని చేయలేదని వివరణ ఇచ్చారు.

  కాని లైవ్‌లో దిలీప్ పోలీసులు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పడంతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు. యువతి తరుపున కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారని ఆరోపణలు చేశారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Siricilla, Suicide

  ఉత్తమ కథలు