YOUNG MAN COMMITS SUICIDE LOSING MONEY IPL BETTING IN BHADRADRI KOTTAGUDEM DISTRICT SNR
Telangana:ప్రాణం తీసిన పందెం..50లక్షల తిరిగి ఇవ్వలేక ఏం చేశాడంటే..
(ప్రాణం తీసిన పందాలు)
Betting mafia:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్ మాఫియాలో చిక్కుకొని మరో ప్రాణం పోయింది. సాయి కిషన్ అనే యువకుడు 50లక్షల వరకు అప్పులు చేసి బెట్టింగ్‌లు నిర్వహించాడు. డబ్బులు పోవడం, అప్పులు ఇచ్చిన వాళ్లు టార్చర్ పెట్టడంతో ఉరివేసుకున్నాడు.
వ్యసనాలు తొలుత సాలెగూటి పోగులు...తర్వాత ఉరితాళ్లు అనే సామెత నిజమని రుజువైంది. ఐపీఎల్ బెట్టింగ్‌కు మరో ప్రాణం బలైపోయింది. పక్కనోళ్లకంటే మనం ఎక్కువ డబ్బులు సంపాధించాలన్న అత్యాశ, ఒకటి, రెండు సార్లు ఓడిపోయినా మళ్లీ గెలుస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా బెట్టింగ్ బానిసలవుతున్నారు కుర్రాళ్లు. ఐపీఎల్ సీజన్ రంజుగా సాగుతుండటంతో..కుర్రాళ్లు ఇంట్లో చెప్పకుండా అప్పులు చేసి మరీ పందాలె కాస్తున్నారు. చేతుల్లో డబ్బులు లేకపోతే ఆన్లైన్ యాప్స్(Online apps)ద్వారా, అప్పులు చేసి మరీ జూదానికి దిగుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kottagudem)జిల్లాలో క్రికెట్ బెట్టింగ్(Cricket betting) ఓ యువకుడి బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి కారణమైంది. జిల్లాలోని బూర్గంపాడు(Boorgampadu)పాండవగుట్ట(Pandavagutta) బస్తీకి చెందిన మోత్కూర్ సాయికిషన్(Motkur Saikishan)అనే యువకుడు సూసైడ్(Suicide)చేసుకున్నాడు. ఆదివారం(Sunday)రాత్రి ఒంటి గంట సమయంలో ఉరివేసుకొని చనిపోయాడు. సాయికిషన్ ఈసారి ఐపీఎల్లో బెట్టింగ్(Betting in the IPL)లు కట్టేందుకు సుమారు 50లక్షల(50 lakhs)రూపాయలు అప్పులు చేసినట్లుగా తెలుస్తోంది. అప్పులు ఇచ్చిన వాళ్ల డబ్బుల కోసం పదే పదే ఒత్తిడి చేస్తుండటంతో భరించలేకపోయాడు. కుటుంబ సభ్యులు అంత ఆర్దిక స్తోమత కలిగిన వాళ్లు కాకపోవడంతో అప్పులు తిరిగి ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో చావు తప్ప వేరే దారి లేదని భావించాడు. ఆ బాధతోనే ప్రాణాలు తీసుకున్నాడు సాయికిషన్.
ప్రాణాలు తీసిన పందెం..
సాయికిషన్ బలవన్మరణం చేసుకోవడంతో కుటుంబ సభ్యులు బోరునవిలపిస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు ఐపీఎల్ బెట్టింగ్‌లకు బానిసై ప్రాణాలు తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బిడ్డ మృతదేహంపై పడి తల్లి కన్నీటిపర్యంతమవడం స్థానికంగా అందర్ని కలసి వేసింది. చదువుకొని జాబ్ చేసి కుటుంబ బాధ్యతల్ని మోస్తాడనుకున్న కొడుకు కాటికిపోయాడని తెలిసి సాయికిషన్ తల్లి గుండెలు పగిలేలా రోదిస్తోంది.తన బిడ్డ చావుకు కారణాలు ఏంటో తెలియవని చెబుతోంది.
అప్పుల బాధతో ఆత్మహత్య..
సాయికిషన్ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతనికి అప్పులు ఇచ్చిన వాళ్లు ఎవరూ..ఎవరెవరితో ఐపీఎల్ బెట్టింగ్‌లు నిర్వహించాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. మరోవైపు సాయి కిషన్ ఫోన్‌కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఓ సాధారణ యువకుడికి 50లక్షల రూపాయల వరకు అప్పు ఇచ్చిన వాళ్లు ఎవరై ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు బూర్గంపాడు పోలీసులు. సాయికిషన్ స్నేహితుల నుంచి కూడా సమాచారం రాబడుతున్నారు. సాయి కిషన్ మాదిరిగానే క్రికెట్ బెట్టింగ్‌ల్లో డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకుంటున్న యువకుల సంఖ్య ఎక్కువగానే ఉందంటున్నారు పోలీసులు.
విచ్చలవిడిగా బెట్టింగ్ మాఫియా..
తెలుగు రాష్ట్రాల్లో కేవలం యువతను టార్గెట్‌గా చేసుకొని ఆన్లైన్లో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాయి కొన్ని బెట్టింగ్ ముఠాలు. అమాయక యువతను డబ్బుల ఆశ చూపిస్తూ ఈజూదం అనే మాఫియాలోకి లాగుతున్నారు. డబ్బులు లేకపోతే అప్పులు చేయించి మరీ ఈ ప్రాణాంతక క్రీడలోకి దింపుతున్నారని పోలీసులు చెబుతున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.