YOUNG MAN COMMITS SUICIDE AFTER WOMAN SI BEATING VRY
Adilabad : మహిళా ఎస్సై కొట్టిందని అవమానంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు
ధర్నా చేస్తున్న తుడుం దెబ్బ నేతలు
Adilabad : మద్యం సేవించి బైక్ వస్తున్న ఓ గిరిజనుడిని స్థానిక మహిళా ఎస్సై కొట్టడడంతో ఆ గిరిజన యువకుడు అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన..
వివాహా నిశ్చితార్థానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో పోలీసులు వాహన తనిఖీలో భాగంగా ఆపి పరీక్షించారు..ఈ క్రమంలోనే ఓ యువకుడిపై ఎస్.ఐ చేయిచేసుకోవడంతో మనస్థాపం చెందిన గిరిజన యువకుడు ఆత్మహత్యా యత్నం చేశారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా ఆ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…..
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గొడిసిర్యాల గోండుగూడ గ్రామానికి చెందిన మడావి నాగరాజు ఈ నెల 13వ తేదీన గొడిసిర్యాల గోండు గూడా గ్రామంలో వివాహ నిశ్చితార్ధానికి హజరయ్యాడు. కార్యక్రమం ముగించుకొని గ్రామానికి వస్తున్న క్రమంలో వారి సంప్రదాయం ప్రకారం కొంత మద్యం సేవించి ఇంటికి బయలుదేరాడు. అయితే దస్తురాబాద్ ఎస్.ఐ. జ్యోతిమణి విధి నిర్వహణలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వస్తున్న మడావి నాగరాజును ఆపి పరీక్షించారు. మద్యం సేవించి ఉండటంతో ఎస్.ఐ జ్యోతి మందలించడంతోపాటు చేయి చేసుకున్నారు.
దీంతో మనస్థాపం చెందిన మడావి నాగరాజు అదే రోజు రాత్రి పురుగుల మందుతాగి ఆత్మహత్య యత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు నాగరాజును వెంటనే జన్నారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. దీంతో ఎస్.ఐ కొట్టడం వల్లే నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆదివాసి గిరిజనులు ఆరోపిస్తున్నారు. తుడుందెబ్బ ఆధ్వర్యంలో గ్రామంలో ఆందోళన చేపట్టి ఎస్.ఐ.పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.