Home /News /telangana /

YOUNG MAN COMMITS SUICIDE AFTER HIS GIRLFRIEND GOT MARRIED IN MEDAK DISTRICT SNR MDK

Medak:ప్రేమించిన అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంది..ఆ తర్వాత ప్రియుడు ఏం చేశాడంటే..

(ప్రేమకు బలైన యువకుడు)

(ప్రేమకు బలైన యువకుడు)

Medak:వయసులో ఉన్న యువకుడు ప్రేమకు ఆకర్షితుడయ్యాడు. అమ్మాయిని ప్రేమించాడు. ఆ యువతి వేరే పెళ్లి చేసుకోని వెళ్లిపోవడంతో తట్టుకోలేకపోయాడు. ఆ మనోవేదన నుంచి బయటపడేందుకు ఏం చేశాడంటే.

    (K.Veeranna,News18,Medak)
    ఆ కుర్రాడిది రెండు పదుల వయస్సు. చిన్న ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు సాహాయపడుతున్నాడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువకుడు..ప్రేమించిన పాపానికి ప్రాణాలు కోల్పోయాడు. కని,పెంచిన తల్లిదండ్రులకు చేదోడు, వాదోడుగా ఉండాల్సిన సమయంలో పిచ్చి నిర్ణయం తీసుకొని వాళ్లను ఒంటరివాళ్లను చేశాడు. తనకు తానే శిక్ష వేసుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. మెదక్ Medak జిల్లాలో ఈ విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా మనోహారాబాద్ (Manoharabad)మండలం కూచారం(Kucharam)రైల్వేస్టేషన్(Railway station) సమీపంలో 21సంవత్సరాల హరీష్‌(Harish)అనే కుర్రాడు రైలు పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.

    ప్రేమించిన అమ్మాయి..
    యువకుడు ప్రాణాలు తీసుకున్న విషయాన్ని గమనించిన స్థానికులు రైల్వే అధికారులకు సమాచారమిచ్చారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకున్నారు. మృతదేహం హరీష్‌ అనే యువకుడిగా గుర్తించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చారు. గత కొద్ది రోజులుగా కూచారం గ్రామానికి చెందిన యువతిని హరీష్‌ ప్రేమించాడు. కొద్దిరోజుల క్రితమే ఆమెకు వివాహం జరిగింది. ప్రియురాలు తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని దూరమవడాన్ని తట్టుకోలేకపోయాడు. ప్రియురాలు వేరే పెళ్లి చేసుకుందని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆ బాధను తట్టుకోలేక శుక్రవారం ఉదయం 9గంటల సమయంలో కూచారం రైల్వే స్టేషన్‌లోని పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు విచారణలో తేల్చారు.

    వేరే పెళ్లి చేసుకుందని..
    మృతుడు హరీష్‌ది స్వస్తలం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూర్‌ గ్రామం. సత్తయ్య, రేణుక మృతుని తల్లిదండ్రులు. ఉపాధి నిమిత్తం మెదక్ జిల్లా మనోహరాబాద్‌ మండలం కూచారం వచ్చారు. హరీష్‌ ఓ పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులతో ఉంటున్నాడు. తండ్రి ట్రాక్టర్‌ డ్రైవర్‌ కాగా.. తల్లి రేణుక పరిశ్రమలో కూలీగా పని చేస్తోంది. 20సంవత్సరాల క్రితం సొంత ఊరుని వదిలి పని కోసం వచ్చింది సత్తయ్య కుటుంబం. ఒక కూతురు, పెద్ద కొడుక్కి వివాహలయ్యాయి. హరీష్‌ పని చేసుకుంటూ తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నాడు.

    ప్రాణాలు తీసుకున్న యువకుడు..
    హరీష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు. మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీవితంపై పూర్తి అవగాహన రాకముందే ప్రేమ, పెళ్లి అనే పిచ్చి ఆలోచనలతో ప్రాణాలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదంటున్నారు పోలీసులు. మరోవైపు ప్రేమించిన అమ్మాయి వేరే పెళ్లి చేసుకోని వెళ్లిపోియంది..ఆమె దూరమైందన్న బాధతో బిడ్డ ప్రాణాలు తీసుకోవడంపై హరీష్‌ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమను ఒంటరి వాళ్లను చేసి వెళ్లిపోయాడని రోదిస్తున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Lovers suicide, Medak District news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు