Home /News /telangana /

YOUNG MAN CALLED DIAL 100 IN VIKARABAD DISTRICT OF TELANGANA AND ASKED THE POLICE FOR TWO BEERS SNR

Telangana: డయల్ 100కి కాల్ చేసి పోలీసుల్ని రెండు బీర్లు తెమ్మన్నాడు.. ఎక్కడంటే

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Vikarabad:తెలంగాణలో ప్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థను మిస్‌ యూజ్ చేస్తున్నారు కొందరు యువకులు. ఎమర్జెన్సీ సర్వీస్‌ కోసం అందుబాటులో ఉంచిన డయల్ 100నెంబర్‌కి వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కాల్ చేసి పోలీసుల్ని బీర్‌ బాటిల్స్ తేవాలని అడగడంతో షాక్ అయ్యారు.

ఇంకా చదవండి ...
ప్రజలకు రక్షణ, శాంతిభద్రతలపై ప్రత్యేక నిఘా, ప్రజల సమస్యల్ని సులువుగా పరిష్కరించేందుకు తెలంగాణ పోలీస్‌శాఖ ప్రెండ్లీ పోలీసింగ్(Friendly policing)పేరుతో అనేక విధాలుగా అందుబాటులో ఉంటోంది. చిన్న చిన్న పొరపాట్లు, అవగాహనరాహిత్యం చేసే చర్యలను సరిదిద్దుతూ కౌన్సిలింగ్ ఇస్తోంది. సైబర్ నేరాల(Cybercrime)పై సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తోంది. ఏ క్షణంలో అపద వచ్చినా వెంటనే స్పందించేలా ఇక ప్రతి ఒక్కరికి డయల్‌ 100(Dial‌100)ఫోన్‌ నెంబర్‌ని అందుబాటులో ఉంచింది. పోలీసుశాఖ ప్రజల శ్రేయస్సు కోసం ఇంత శ్రద్ధ చూపిస్తుంటే..కొందరు పోలీసు సేవలను దుర్వినియోగం చేస్తున్నారు. ఎంతో విలువైన పోలీసు(Police)ల సమయాన్ని వృధా చేయడమే కాకుండా వెటకారం ప్రదర్శిస్తున్నారు. వికారాబాద్‌(Vikarabad)జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఆదివారం రాత్రి నైట్ దౌల్తాబాద్‌(Daulatabad)మండలం గోకఫసల్వాడ్ (Gokafasalvad)గ్రామం నుంచి డయల్ 100నెంబర్‌కి ఫోన్‌కాల్ వచ్చింది. తాను అత్యవసరంగా పోలీసు సేవలు కావాలని...ఎలాగైనా తనను బ్రతికించండి అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన వ్యక్తి పోలీసులు అతని అడ్రస్‌(Address)‌కి వెళ్లి ఏం హెల్ప్ కావాలో అడగడంతో అతనిచ్చిన జవాబుకి ఆశ్చర్యపోయారు.

డయల్ 100కి కాల్ చేసి..
సరిగ్గా అర్ధరాత్రి 2గంటల సమయంలో కాల్ రిసీవ్ చేసుకున్న పోలీసులు రిసీవ్ చేసుకున్న ఫోన్‌ జీపీఎస్‌ ద్వారా లొకేషన్ ట్రేస్ చేసి నిమిషాల వ్యవధిలోనే అతని ఇంటి దగ్గరకు చేరుకున్నారు. పోలీసులు అక్కడికి వెళ్లిన తర్వాత ఫోన్ చేసిన యువకుడి రియాక్షన్ చూసి షాక్ అయ్యారు. డయల్ 100కి కాల్ చేసిన వ్యక్తి పోలీసులు ఇంటి దగ్గరకు చేరుకోగానే తనకు అర్జెంటుగా రెండు బీర్‌ బాటిల్స్ కావాలని తెచ్చిస్తారా అని అడగడంతో పోలీసులకు కోపం వచ్చింది. రాత్రి వేళ..అది కూడా డయల్ 100లాంటి ఎమర్జెన్సీ నెంబర్‌కి కాల్ చేసి బీర్‌ బాటిల్స్ తెమ్మనడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

రెండు బీర్లు తెమ్మన్నాడు..
పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం డయల్ 100కి కాల్ చేసి బీర్ బాటిల్స్ తెమ్మని అడిగిన వ్యక్తి పేరుతో జనిగెల మధుగా గుర్తించారు. అతని వివరాలు సేకరించడంతో పాటు పోలీసులు అతని ఇంటికి వెళ్లిన సమయంలో మద్యం ఉన్నట్లుగా గుర్తించారు. డ్యూటీలో ఉన్న పోలీసుల అమూల్యమైన సమయాన్ని వృగా చేయడమే కాకుండా ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ఏర్పాటు చేసిన డయల్‌ 100నెంబర్‌ని దుర్వినియోగం చేసినందుకు అతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. ఇకపై ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Telangana Police, Vikarabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు