హైదరాబాద్‌కు చదువు కోవడానికి వచ్చిన యువతి ఫుడ్ డెలివరి ఎక్సిక్యూటివ్‌గా పని చేస్తోంది. చదువు కోవడంతో పాటు తల్లిదండ్రుకు కూడా సహాయ పడుతోంది. సాధారణంగా ఫుడ్ డెలివరిలో ఎక్కువగా యువకులు, మధ్య వయస్కుల వారు ఉంటారు. ఎందుకంటే నగరంలో అనుకున్న సమయంలో ఫుడ్ డెలివరి చేయాలంటే కాస్త యువరక్తం అవసరం ఉంటుంది..మరోవైపు నగరానికి వచ్చిన యువత తమ చేతి ఖర్చుల కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఫుడ్ డెలివరి సంస్థల్లో పని చేస్తున్నారు.
అయితే వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువతి పురుషులకు దీటుగా..తాను చదువుకోవడానికి వచ్చి..చేతి ఖర్చుల కోసం ఫుడ్ డెలివరి ఎక్సిక్యూటివ్‌గా మారింది. వివరాల్లోకి వెళితే...వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన మేడిపల్లి రచన హోటల్ మేనెజ్ మెంట్ కోర్సు చేయడానికి హైదరాబాద్ వచ్చింది. ఆమె తల్లి దండ్రులు రోజు కూలి చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా రచన ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ కాలేజిలోనే చదివింది..
ఆమెకు ఉన్నత చదువులకు వెళ్లాలనే కోరికతో పాటు స్థానిక లెక్చరర్లు, తోటి విద్యార్థుల ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో అడుగుపెట్టింది.. హైదరాబాద్‌లో అడుగు పెట్టిన..అనంతరం హెటల్ మెమేజ్‌మెంట్ కోర్సులో చేరింది.. కాని హైదరాబాద్‌లో ఉండాలంటే డబ్బులు కావాలి కాబట్టి.. పాల బూతులో పని చేసింది. ఉదయం నాలుగు గంటలకే లేచి పాలబూతులో పని చేసిన తర్వాత ఉదయం తిరిగి కాలేజికి వెళ్లి చదువుకుంది. పాల బూతులో చేయడం వల్ల ప్రతి నెల తొమ్మిది వేల రూపాయల వరకు వచ్చేవి.. దాంట్లో రూం కిరాయ కోసం మూడు వేలతో పాటు అదనంగా మరో వెయ్యి రూపాయలు ఇతర ఖర్చులకు తీసుకుని మిగతావి తన తల్లితండ్రులకు పంపించింది..
మరో కొద్ది రోజుల్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం లభిస్తుందని ..అప్పటి వరకు ఇలాంటీ పనులు చేస్తూ.. చదువుకోవాలనే కోరికను తెలిపింది. మొత్తం మీద ఎక్కువ మంది పురుషులు ఫుడ్ డెలివరి బాయ్స్‌గా పని చేస్తుంటే...రచన ధైర్యం చేసి ఈ రంగానికి రావడం పలువురి నుండి ప్రశంసలు అందుకుంటుంది.. చదువుకోవాలనే సంకల్పం ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా..ఎదురించి తాము అనుకున్నది సాధించవచ్చనే దీమాతో పలువురు యువతులకు మార్గదర్శిగా నిలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Food delivery, Hyderbad