Breking : హైదరాబాద్ ఎల్బీనగర్లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి అంగీకరించడంతో ప్రియురాలిపై కక్ష పెంచుకున్న ప్రియుడు కత్తిపోట్లకు గురి చేశాడు.. యువతి ఇంటికి వెళ్లి కత్తితో విచక్షణ రహితంగా ఆమెను పొడిచాడు.
గత కొద్ది రోజుల క్రితమే నగరంలోని చందానగర్ ఓ లాడ్జ్‌లో యువతి హత్య సంఘటన మరచిపోకముందే మరో యువతి కత్తి పోట్లకు గురైంది. చందానగర్ కేసులో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిన ప్రియురాలిని హత్య చేసి పారిపోతే.. ఇక్కడ మాత్రం ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో పాటు ఆమెకు పెళ్లి సంబంధం చూడడంతో చెలరేగిపోయిన ప్రియుడు నేరుగా ఆమె ఇంటికి వెళ్లి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆమెపై 18 కత్తిపోట్లతో గాయపరిచాడు. దీంతో యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఎల్బీనగర్కు చెందిన శిరీష అనే యువతి, వికారాబాద్ జిల్లాకు చెందిన బస్వరాజ్ అనే యువకుడు గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. బస్వారాజు ఓ ప్రైవేటు కంపనీలో ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇరువైపుల కుటుంబాలు ఒప్పుకోలేదు.. దీంతో పాటు అమ్మాయి తల్లిదండ్రులు శిరీషకు ఇటివల పెళ్లి సంబంధాన్ని ఖాయం చేశారు. దీంతో తట్టుకోలేని బస్వరాజు శీరిషపై కక్ష పెంచుకున్నాడు. తనను కాదని వెరొకరిని పెళ్లి చేసుకోవడం తట్టుకోకుండా ఆమె కడతేర్చాలనే కుట్రకు తెరలేపాడు. దీంతో నేడు సాయంత్రం ఎల్బీనగర్లోని ఆమె ఇంటికి చేరుకుని వాగ్వావాదానికి దిగాడు. ఈ క్రమంలోనే ఆమెపై విచక్షణ రహితంగా హత్య చేశాడు. కాగా శిరీషను 18 చోట్ల పొడిచినట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన శీరిష కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
మరోవైపు సంఘటన సమాచారం తెలుసుకున్నపోలీసులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు హుస్నాబాద్‌లో కూడా ఇలాంటీ సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రేమికుల కులాలు వేరుకావడంతో ఇరు కుటంబాల సభ్యులు ఒప్పకోవలేదు.. దీంతో ఆ యువతి సైతం మరోకరిని పెళ్లి చేసుకునేందుకు సిద్దమైంది. దీంతో యువతి తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయం చేయడంతో కక్ష పెంచుకున్న ఆమె ప్రియుడు ఆమెకు కాబోయో భర్తను దారుణంగా హత్య చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.