YOUNG GIRL PROTEST DHARNA INFRONT OF A POOJARI HOUSE DUE TO FRAUD IN HYDERABAD VRY
Hyderabad : పెళ్లి కావడం లేదని పురోహితుడి వద్దకు వెళితే.. తానే పెళ్లి చేసుకుంటానని..
ప్రతీకాత్మక చిత్రం
Hyderabad : పెళ్లి కావడం లేదని, తనకు మంచి సంబంధాలు చూడమని పురోహితుడి వద్దకు ఓ యువతి వెళింది.. అయితే.. ఆ యువతిని తానే పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు ఓ పురోహితుడు.
నమ్మిన వారిని నట్టేట ముంచడం కొందమందికి అలవాటుగా మారింది.. అదే పెట్టుబడిగా మాయమాటలు చెబుతూ వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు.. ఇబ్బందుల్లో ఉన్న వారిని చేరదీయాల్సి పోయి తమకు అనుకూలంగా మార్చుకుంటున్న సంఘటనలు ఇప్పడు నిత్యాకృత్యం అయ్యాయి.. దీంతో మోసగాళ్ల మాయపడి బలైపోయిన తర్వాత బాధితులు రోడ్డెక్కుతున్నారు.. ముందుగా చెప్పినట్టల్లా చేసి ఆ తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. ఇక నమ్మిన వారిని మోసాలు చేయడం ఒక్కరంగానికే కాకుండా ప్రతి రంగానికి పాకిందనే చెప్పాలి.. ఎందుకంటే చివరకు పురోహితులు కూడా వ్యక్తుల జీవితాలతో ఓ ఆట ఆడుకుంటున్నారు. పౌరహిత్యం పేరుతో తమ వద్దకు వచ్చిన వారిని పూజల పేరుతో ఇష్టారాజ్యంగా చేస్తున్నారు.. ఇలా ఓ పూజారీ సైతం ప్రస్తుతం తన వద్దకు నమ్మివచ్చిన ఓ అవివాహితురాలని నమ్మించి తానే పెళ్లి చేసుకుంటానని చివరకు పారిపోయాయిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది..
పూజారులు అంటే సమాజంలో కాస్త గౌరవ మర్యదలు ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే దైవాన్ని నమ్మె వారికి వారిపై మరింత నమ్మకం ఉంటుంది..ఇలా తమకు ఏ సమస్య వచ్చినా పూజారుల వద్దకు వెళ్లి మంచి చెడు అంశాలతో పాటు కుటుంబపరమైపప వ్యక్తిగత అంశాలను కూడా వారితో చెప్పుకుని పరిష్కారం కోసం వెళతారు..ఇలా నగరంలో జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దమ్మాయిగూడలో నివసించే ఓ యువతి తనకు పెళ్లి కావడం లేదని స్థానికంగా ఉండే ఓ పురోహితుడి వద్దకు వెళ్లింది. తనకు పెళ్లి కావడం లేదని ఏవైనా మంచి సంబంధాలు ఉంటే చెప్పాలని వెళ్లింది. దీంతో మంచి సంబంధాల మాటున ఆయువతిని తన మాయమాటలతో లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని శారీరక అవసరాలు తీర్చుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోమని గట్టిగా నిలదీస్తే... కొద్ది రోజులుగా కనిపించకుండా పోయాడు.. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులతో ఆ పురోహితుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది.
మరోవైపు తనకు జరిగిన మోసాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా నేరుగా పురోహితుడి ఇంటిముందు ధర్నా చెపట్టడడంతో పోలీసులు సైతం ఎలాంటీ చర్యలు చేపట్టలేదని చెప్పారు.. తమ దృష్టికి రాలేదని యువతి ఫిర్యాదు అందిన తర్వాతే చర్యలు చేపడతామని పోలీసులు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.