Home /News /telangana /

YOUNG GIRL KIDNAPPED REPE AND MURDER BY LOVER AT MANAKONDURU IN KARIMANAGR VRY KNR

Rape and murder : ప్రేమికురాలిని ఎత్తుకెళ్లి అత్యాచారం, హత్య.. అసలేం జరిగిదంటే..

హత్యకు గురైన యువతి

హత్యకు గురైన యువతి

Rape and murder : కరీంనగర్ జిల్లాలో మరో ఘోరం వెలుగు చూసింది. ప్రియురాలిని కిడ్నాప్ చేసిన ప్రియుడు ఆమెపై అత్యాచారం చేసి ఆతర్వాత హత్య చేశాడు.. అయితే తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు..

    ( Srinivas New 18, Telugu Karimanagar )

    కరీంనగర్ జిల్లాలో రెండు రోజుల క్రితమే ఓ యువతి తన భర్త ఇంటిముందు సుమారు 41 రోజుల పాటు దీక్ష చేసిన పట్టించుకోని పోలీసులు మరోసారి తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో ఓ దుర్మార్గుడు తాను ప్రేమించిన అమ్మాయినే మాయమాటలతో తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆతర్వాత హత్య చేసినట్టు చెప్పాడు..

    మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మి 18 సంవత్సరాలు గత వారం రోజుల నుంచి కనిపించడం లేదని ఎల్.ఎం.డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. కాగా పోరండ్ల గ్రామానికి చెందిన ఆసొద నిఖిల్, వరలక్ష్మి లు ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారి ప్రేమకు అడ్డుపడి అంగీకరించకపోవడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఈ క్రమంలో ఎవరికి వారు దూరంగా ఉండాలని నిర్ణయించారు.

    Family Suicide : తెలంగాణలో మరో కుటుంబం ఆత్మహత్య, సూసైడ్ నోట్.. ఏం చెప్పారంటే.. !


    అయితే ఇందుకు వరలక్ష్మి అంగీకరించినా.. నిఖిల్ మాత్రం ఒప్పుకోలేదు.. దీంతో ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవడమా లేదంటే లొంగీదీసుకుని హత్య చేయాలే కుట్రకు తెరలేపాడు.. ఈ క్రమంలోనే ఈ నెల 2న వరలక్ష్మికి మాయమాటలు చెప్పి బయటకు తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుని ఉండచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో నిఖిల్ వరలక్ష్మిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఆతర్వాత ఇంటికి తాపిగా చేరాడు..

    మరోవైపు తమ కూతురు కనిపించడం లేదంటూ ఆమెను నిఖిల్ కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్టు రెండవ తేదినే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కాని పోలీసులు మాత్రం శుక్రవారం ( నిన్న ) నిఖిల్‌ను పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి విచారించడంతో షాకింగ్ నిజాలు తెలిపాడు. ఆమెను తానే మానకొండురు మండలం చెంజర్ల గ్రామ శివారులో గల గుట్ట వద్దకు తీసుకువెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్టు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో నిందితున్ని తీసుకుని సంఘటన స్థలం వద్దకు పోలీసులు చేరుకుని వరలక్ష్మి మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. కాగా ఈ హత్య జరిగి వారం రోజులు గడుస్తుండడంతో శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది.

    Vanama Raghava : ముగిసిన విచారణ, వనమా రాఘవ కోర్టుకు, ఆయనపై పన్నెండు కేసులు .. ఎం చెప్పాడంటే...


    అయితే తాము పోలీసులకు ఫిర్యాదు చేసిన రోజునే పట్టించుకుని ఉంటే వరలక్ష్మి బతికి ఉండేదని, వారు నిర్లక్ష్యం వహించడం వల్లే హత్యకు గురైందని ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ పంపనున్నట్టు పోలీసులు తెలిపారు.

    మీ నగరం నుండి (కరీంనగర్)

    తెలంగాణ
    కరీంనగర్
    తెలంగాణ
    కరీంనగర్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Karimnagar, Lover, Murder

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు