Home /News /telangana /

YOUNG GIRL JUMPED FROM FROM AMEERPET METRO STATION TRY TO COMMIT SUICIDE VRY

Hyderabad : మెట్రో స్టేషన్ నుండి దూకి యువతి ఆత్మహత్య... నెలరోజుల క్రితమే దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ ఘటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad : హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ రెండో అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది.

    నగరంలోని మెట్రోలు సూసైడ్ కేంద్రాలుగా మారుతున్నాయా.. స్టేషన్లవద్ద సెక్యూరిటి ఉన్నా వారి కళ్లు గప్పి కొందరు నగరవాసులు ఆత్మహత్యలకు ఎలా పాల్పడుతున్నారు..ఇటివల మెట్రో స్టేషన్లపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడుతుండడంతో.. ఆయా స్టేషన్లలలో మరింతకట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది.

    హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ రెండో అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం రాత్రి 8గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మెట్రో స్టేషన్‌ రెండో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించిన యువతి పక్కనే ఉన్న టింబర్‌ డిపోలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన మెట్రో సిబ్బంది 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు యత్నించిన యువతి టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. బీటెక్‌ చదువుతూ అమీర్‌పేటలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. కుటుంబ సమస్యలా? ఆర్థిక సమస్యలా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

    ఇది చదవండి : టీఆర్ఎస్, బీజేపీలు ప్రజల్లో చెవుల్లో పూలు పెట్టడానికే ధర్నాలు..


    కాగా నెల క్రితమే చత్తీస్‌ఘడ్‌కు చెందిన 45 సంవత్సరాలు ఉన్న వ్యక్తి దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు అప్పటికే అనారోగ్యంతో భాదపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. సో మొత్తం మీద గతంలో కూడా మెట్రో స్టేషన్ల నుండి పలువురు దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. కాగా హైదరాబాద్‌లో సూసైడ్ స్పాట్‌గా నగరంలోని ట్యాంక్‌బండ్ ఉండేది.. అయితే అక్కడ పోలీసులు నిరంతర పర్యవేక్షణ చేయడంతోపాటు సూసైడ్స్ జరగకుండా.. పోలీస్ ఆవుట్ పోస్ట్‌ కూడా ఏర్పాటు చేసి నిరంతర గస్తి ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ ఆత్మహత్యలు చేసుకోవడం తగ్గిపోయింది. తాజాగా ఇప్పుడు మెట్రో స్టేషన్లు ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.. అయితే భవిష్యత్‌లో ఇలాంటీ సంఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలు చేపట్టాల్సి అవసరం ఎంతైనా అవసరం అని నగర ప్రజలు భావిస్తున్నారు.

    ఇది చదవండి : వేములవాడలో పెళ్లి వ్యాన్ బోల్తా.. పలువురికి గాయాలు..

    Published by:yveerash yveerash
    First published:

    Tags: Attemp to suicide, Hyderabad, Hyderabad Metro

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు