హోమ్ /వార్తలు /తెలంగాణ /

రెవెన్యూ అధికారులకు లంచం చెల్లించడం కోసం.. జాతీయ జెండా పట్టుకుని భిక్షాటన చేసిన యువరైతు.. ఎక్కడంటే..

రెవెన్యూ అధికారులకు లంచం చెల్లించడం కోసం.. జాతీయ జెండా పట్టుకుని భిక్షాటన చేసిన యువరైతు.. ఎక్కడంటే..

భిక్షాటన చేస్తూ నిరసన తెలుపుతున్న యువ రైతు

భిక్షాటన చేస్తూ నిరసన తెలుపుతున్న యువ రైతు

ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. రెవెన్యూ అధికారుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. సాగుతోనే అనేక సమస్యలు ఎదుర్కొంటున్న అన్నదాతలను కొందరు రెవెన్యూ అధికారులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా శరీరంపై బ్యానర్ ధరించి, ఒక చేతిలో జాతీయ జండా పట్టుకుని మరోచేత్తో భిక్షాటన చేస్తూ ఓ యువ రైతు నిరసన తెలిపారు.

ఇంకా చదవండి ...

ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. రెవెన్యూ అధికారుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. సాగుతోనే అనేక సమస్యలు ఎదుర్కొంటున్న అన్నదాతలను కొందరు రెవెన్యూ అధికారులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఏళ్ల కొద్దీ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ అవస్థలు పెడుతున్నారు. ఇలాంటి ఘటన తాజాగా మరొకటి బయట పడింది. వివరాల ప్రకారం.. శరీరంపై బ్యానర్ ధరించి, ఒక చేతిలో జాతీయ జండా పట్టుకుని మరోచేత్తో భిక్షాటన చేస్తూ ఓ యువ రైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న సంఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారుల వైఖరితో విసుగు చెంది ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నానంటూ ఆ యువ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మంచిర్యాల తాండురు మండల కేంద్రానికి చెంచిన రాజేంద్ర ప్రసాద్ అనే యువ రైతుకు సర్వేనంబర్ 612/55 లో మూడు ఎకరాల 42 సెంట్లు, 612,6/2 సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల 58 సెంట్ల భూమి కలిపి మొత్తం 8ఎకరాల భూమి ఉంది.

అయితే ఈ భూమి విషయంలో రెవెన్యూ అధికారులు రికార్డులు తారుమారు చేశారని, తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆ బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన భూమికి సంబంధించిన రికార్డులు సరిచేయాలని గత కొంతకాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వాపోయాడు.


రెవెన్యూ అధికారులకు లంచం చెల్లించేందుకు ఆర్థిక సహాయం చేయాలని ముద్రించిన బ్యానర్ ను మెడలో వేసుకొని మండల కేంద్రంలోని ఐబీ చౌరస్తాలోని పలు దుకాణాల్లో భిక్షాటన చేశాడు. అనంతరం 48 గంటల నిరాహార దీక్ష చేపడుతున్నట్లు చెప్పాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తన న్యాయం చేయాలని బాధిత రైతు డిమాండ్ చేస్తున్నాడు.

First published:

Tags: Adilabad, Farmers Protest

ఉత్తమ కథలు