Home /News /telangana /

YOUNG BOY HELD FOR GROWING CANNABIS AT HOME IN LAKDIKAPOOL VRY

cannabis : గంజాయికి అలవాటు పడిన యువకుడు.. నగర నడిబోడ్డున మొక్కల పెంపకం..

cannabis

cannabis

cannabis : గంజాయికి అలవాటు పడిన ఓ యువకుడు .. నేరుగా ఇంట్లోని పెరెంట్లో గంజాయి మొక్కలను పెంచుతున్నాడు.( young boy held for growing cannabis at home ) సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువకున్ని అరెస్ట్ చేసి పలు కేసులు నమోదు చేశారు.

    హైదరాబాద్‌లోని ( Hyderabad ) సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారీపై జరిగిన అత్యాచారానికి ( rape ) మూల కారణం గంజాయి తో పాటు ఇతర మత్తు పదార్థాలుగా తేలడంతో తెలంగాణ పోలీసులు గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ( PD act)సైతం పెడుతుండడంతోపాటు ఏజెన్సీ ప్రాంతాల నుండి వస్తున్న గంజాయిని కట్టడి చేసేందుకు పకడ్బద్ది చర్యలు చేపట్టారు. ముఖ్యంగా గంజాయి ( cannabis ) స్మగ్లింగ్ జరుగుతున్న ఆంధ్ర ,ఓడిశా సరిహద్దులతో పాటు హైదరాబాద్‌ నగరంలో సరఫరా చేస్తున్న వారిపై నిఘా పెట్టారు. దీంతో కొద్ది రోజుల్లోనే అనేక కేసులు నమోదు చేశారు. నగరంలో గంజాయి సప్లై దారులతో పాటు వాటిని సేవిస్తున్న వారిపై కూడా నిఘా పెంచారు.

    దీంతో నగరంలోని ముఖ్యంగా ధూల్‌పేట్, మంగళ్‌హాట్ లాంటీ ప్రాంతాలతో పాటు నగరంలోని కేఫ్‌లు ఇతర స్మగ్లింగ్ ఏరియాలపై ప్రత్యేక బృందాలతో నిఘాను పెంచారు. దీంతో గంజాయి వినియోగించే వాళ్లు విలవిలలాడిపోతున్నారు. మరోవైపు పోలీసులు ఉక్కు పాదం మోపడంతో అందుబాటులో లేకుండా పోయింది. ( young boy held for growing cannabis at home )అయితే ఇలా గంజాయికి చాలా రోజులుగా అలవాటు పడిన యువత సరికొత్త మార్గాలను ఎంచుకుంటుంది. బయటి ప్రాంతాల నుండి గంజాయి రవాణ లేకపోవడంతో ..కొంతమంది స్మగ్లర్లతో పాటు గంజాయికి అలవాటు పడిన వారు సరికొత్త ప్లాన్‌కు తెర తీస్తున్నారు.


    Warangal : వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి 1100 కోట్లు.. జీవో జారీ


    ఈ క్రమంలోనే గంజాయిని తమ ఇంట్లోనే పెంచుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. నగర శివారు ప్రాంతాలతో పాటు బిల్డింగ్‌లపైనే లేదంటే ఇంటివెనకాల గల పెరంట్లో గంజాయి మొక్కలను పెంచుతున్నారు. ఇలా కొంతమంది నగరంలో ఇప్పటికే పట్టుబడ్డారు.( young boy held for growing cannabis at home ) ఇక తాజాగా గంజాయికి అలవాటు పడిన మరో 19 సంవత్సరాల యువకుడు తన ఇంట్లో గంజాయి మొక్కలను పెంచుతూ పోలీసులకు పట్టుపడ్డాడు.


    Bus accident : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు.. ఇద్దరు పిల్లలతో పాటు డ్రైవర్ మృతి.


    సైఫాబాద్ పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్ నగరంలోని లక్డికాపూల్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ ఆరీఫ్ అనే యువకుడు నగరంలో బ్యాండ్ మాస్టర్‌గా పనిచేస్తున్న యువకుడు గంజాయికి అలవాటు పడ్డాడు.( young boy held for growing cannabis at home ) ఇటివల గంజాయి లభించికపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొన్న ఆరీఫ్ దీన్ని అధిగమించేందుకు ఏకంగా తన ఇంటి పెరడులో గంజాయి మొక్కలను నాటాడు. కాగా ఆ మొక్కలు పెరిగిన తర్వాతా తానే వాడుకునేందుకు ప్లాన్ వేశాడు.

    అయితే ఇంట్లో గంజాయి మొక్కల పెంపకంపై సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు శనివారం రైడ్ చేసి పట్టుకున్నారు. మొక్కలను ధ్వంసం చేసి ఆరీఫ్ పై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశామని చెప్పారు.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hyderabad, Telangana Police

    తదుపరి వార్తలు