Home /News /telangana /

YONG GIRL COMMITS SUICIDE OF HER BROTHER IN LAW HARASSMENT TO GET MARRIAGE VRY

Khammam : పీజీ మరదలిపై అక్క భర్త కన్ను.. పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి.. ఆమె ఏం చేసిందంటే..

మృతురాలు ప్రమీల

మృతురాలు ప్రమీల

Khammam : ఇంటి పెద్దగా ఉండాల్సిన ఓ బావ తన మరదలిపై కన్నేశాడు.. మరో పదిహేను రోజుల్లో పెళ్లికి సిద్దమవుతున్న మరదలు, తననే పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తేవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

    భర్త చనిపోయి అయిదుగురు ఆడపిల్లల భారం తనపై వేసినా ధైర్యం కొల్పోకుండా ఊళ్లోనే వ్యవసాయం చేస్తూ.. కూతుళ్లను చదివిస్తూ వారికి పెళ్లిలు సైతం చేస్తున్న ఓ తల్లికి అల్లుడి రూపంలో కష్టాలు చేరాయి.. సాఫిగా జరుగుతున్న సంసారంలో తన అల్లుడి దుర్భిద్ది ఓ కూతురు ప్రాణాలను బలిగొంది. తన మూడో అల్లుడే అయిదో కూతురుపై కన్నేసి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు. అల్లుడిని కాదనలేక భయబ్రాంతులకు లోనైన ఆమె చివరి కూతురుకు వివాహం సైతం నిర్ణయించినా అల్లుడి మనసు మాత్రం మారలేదు.. మరదలిపై మరింత ఒత్తిడిని తేవడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

    ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలోని భగవాన్ నాయక్ తండాకు చెందిన గుగులోతు శ్రీను, చిన్ని భార్యభర్తలు. కాగా వీరికి అయిదుగురు ఆడపిల్లలు ఉన్నారు.. మరోవైపు కొన్నాళ్ల క్రితం శ్రీను అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో పిల్లల భారం చిన్నిపై పడింది. దీంతో వ్యవసాయం చేసుకుంటూ వారిని పోషిస్తోంది. మరోవైపు అయిదుగురిలో నలుగురి పెళ్లిలు కూడా చేసింది. ఇక అందరికంటే చిన్న కూతురు ప్రమీల 22 ఖమ్మంలోనే పీజీ చదువుతోంది. ఇక ఆమెకు కూడా పెళ్లి చేయాలని చిన్ని నిర్ణయించి విజయవాడకు చెందిన ఓ యువకడితో వివాహం నిశ్చయించారు. ఏప్రిల్ 10న పెళ్లి ఫిక్స్ కావడంతో పెళ్లి పనుల్లో బీజీ అయ్యారు..

    Gadwala : ఫోన్‌ కొనివ్వలేదని తల్లిని రోకలిబండతో బాదిన కొడుకు.. తలపగిలి..

    కాని అంతకుముందు నుండే ప్రమీలపై తన మూడో బావ సంతోష్ కన్నేశాడు. ఆమెను ఎలాగైనా తన దానిని చేసుకోవాలనే వక్రబుద్దికి తెరలేపాడు. తననే పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు. ఇంట్లో వారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అల్లుడి వేధింపులు భరించలేక తల్లితో పాటు చిన్నకూతురు ప్రమీల ఇటివల వేరే ఇంటికి వెళ్లారు. అక్కడకు కూడా వచ్చి అసభ్యంగా మాట్లాడడంతో పాటు వేధింపులకు గురి చేసినట్టు తెలుస్తోంది.

    అయితే ఇలా సొంత బావ వేధింపులకు గురిచేయడంతో భరించలేని ప్రమీల ఈ నెల 22న అర్ధరాత్రి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఆ తర్వాత వాంతులు చేసుకుంటుండడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో తన అల్లుడిపై చిన్ని ఫిర్యాదు చేసింది. ఆయన వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని పేర్కోంది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Khammam, Suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు