హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: తెలంగాణలో యమధర్మరాజు గుడి.. ఇలా చేస్తే ఆయుష్సు పెరుగుతుందట

Telangana: తెలంగాణలో యమధర్మరాజు గుడి.. ఇలా చేస్తే ఆయుష్సు పెరుగుతుందట

యమధర్మరాజు

యమధర్మరాజు

Telangana:  భారతదేశంలో మూడు నాలుగు మాత్రమే యమధర్మరాజు ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి మన తెలంగాణలో ఉంది.  దానధర్మాలు చేయకున్నా.. ధర్మపురి వెళ్లి రావాలని ఒక నానుడి ఉంది. 

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(పి.శ్రీనివాస్, న్యూస్ 18తెలుగు ప్రతినిధి, కరీంనగర్ జిల్లా)

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణం ఎన్నో ఏళ్లుగా ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంతో పాటు వెంకటేశ్వరస్వామి, వేణుగోపాల స్వామి,  ఆంజనేయస్వామి,  రామాలయం, రామలింగేశ్వర స్వామి, సంతోషిమాత ఆలయాలు ఉన్నాయి.  ఈ పుణ్యక్షేత్రానికి  వెయ్యేళ్ల చరిత్ర ఉంది.  ప్రాచీన కాలంలో  ధర్మపురం, ధర్మనపురం, ధర్మవురా, ధర్మపురం అని పిలిచేవారట. ప్రాచీన సంప్రదాయాలు, సంస్కృతి,కళలు చరిత్ర కలిగిన ధర్మపురి.. వైదిక విద్యలకు, జ్యోతిష్యశాస్త్రానికి కేంద్రంగా ఉంది. ధర్మపురిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పవిత్ర గోదావరి నది తీరాన వెలసిన.. శివకేశవుల నిలయమైన..  ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, శ్రీ రామలింగేశ్వరాలయం, మసీదులు ప్రక్క ప్రక్కనే ఉన్నాయి.  అనాది నుంచి శైవ, వైష్ణవ, ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి ఉంది. ధర్మపురికి పొతే యమపురి ఉండదని స్థానికులు చెబుతుంటారు.ఇక్కడ స్వామి వారు యోగానంద నరసింహ స్వామి భక్తుల కోరికలను నేరవేరుస్తున్నాడు.

యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమ ధర్మరాజు.. ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకొని ఆలయం నివాసం ఏర్పర్చుకున్నట్లు పురాణం గాథలు చెబుతున్నాయి. ఆలయ ద్వారం కుడి వైపున యమ ధర్మరాజు విగ్రహం ఉంటుంది. యమ ధర్మరాజుని దర్శించుకొని నృసింహుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. పూర్వం ధర్మవర్మ అనే రాజు ధర్మ ప్రవర్తుడై ప్రజలందరినీ ధర్మ మార్గంలో నడిపించి నలుగు పాదముల ధర్మంతో ఈ క్షేత్రాన్ని పరిపాలించినందుకు ధర్మపురి పేరు వచ్చిందని పురాణాల్లో చెప్పారు.  .

భారతదేశంలో మూడు నాలుగు మాత్రమే యమధర్మరాజు ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి మన తెలంగాణలో ఉంది.  దానధర్మాలు చేయకున్నా.. ధర్మపురి వెళ్లి రావాలని ఒక నానుడి ఉంది.  ధర్మపురి రాగానే ముందుగా ధర్మరాజును దర్శించుకోవాలని.. ధర్మరాజు గుడి ముందు ఉన్న గండ దీపంలో నూనె పోస్తే యమగండ దోషాలు అన్ని పోతాయి చరిత్ర ఆధారాలు చెప్తున్నయని ఆలయ పూజలు చెబుతున్నారు.

ఇక్కడ యమధర్మ రాజుకు భరణి నక్షత్రంలో తైలాభిషేకం, పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం చేస్తుంటారు. ఆయుధ సూక్తం ద్వారా మహా మృత్యుంజయ మంత్రంతో అభిషేకం జరిపిస్తే మృత్యు  దోషాలని తొలగిపోతాయని ఆలయ పూజారులు చెబుతున్నారు.   ఈ ధర్మపురిలో కొలువైన యమధర్మరాజు భరణి నక్షత్రంలో భరణి పూజలు జరుపుకుంటే వారికి ఆయుష్షు పెరుగుతుందనే విశ్వాసం కూడా ఉంది.

First published:

Tags: Dharmapuri, Telangana