గత కొద్దిరోజులుగా ఒకరినొకరు దూషించుకుంటూ రోడ్లెక్కిన నేతలు ఇపుడు ఆలయాలు, హోమాలు అంటూ తిరుగుతున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి ధీటుగా ఎదుగుతున్న బీజేపీ కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.
తెలంగాణలో యాగం ఫీవర్ (Yagam Fever) నడుస్తోంది. గత కొద్దిరోజులుగా ఒకరినొకరు దూషించుకుంటూ రోడ్లెక్కిన నేతలు ఇపుడు ఆలయాలు, హోమాలు అంటూ తిరుగుతున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి ధీటుగా ఎదుగుతున్న బీజేపీ కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు (Telangana Chief Minister KCR)కు యాగం (Yagam) చేయడం అంటే చాలా ఇష్టం. దేవుళ్లను పూజించడం, యాగాలు జరిపించడం కేసీఆర్‌కు ఆనవాయితీ. ఇదే క్రమంలో కేసీఆర్ (KCR) ఇప్పుడు యాదాద్రి ప్రారంభోత్సవం పురస్కరించుకుని మార్చిలో 'మహా సుదర్శన యాగం (Maha Sudarshana yagam) ' నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
దీంతో టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్యేలు కూడా స్ఫూర్తి పొందినట్లు తెలుస్తోంది. ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చండీ యాగం నిర్వహించారు. ఇటీవల ఆయా నియోజకవర్గాలు, వారం రోజుల వ్యవధిలో వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య ఒకరి తర్వాత మరొకరు చండీ యాగాలు నిర్వహించారు. రమేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో యాగం చేయగా, రాజయ్య ఓ ఆలయంలో పార్టీ కార్యకర్తల సమక్షంలో మరొక యాగం (Yagam) చేశాడు. మరికొంత మంది మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో సొంతంగా యాగం నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
జీయర్ స్వామి ఆశ్రమానికి కేసీఆర్..
కాగా, యదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana Chief Minister KCR) ముచ్చింతల్‌లోని జీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణం చేపట్టాలని, 21 నుంచి మహా సుదర్శనయాగం (Maha Sudarshana yagam) నిర్వహించాలని ఇప్పటికే ముహూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు, ఆహ్వానాలు, సంబంధిత అంశాలపై జీయర్ స్వామితో సీఎం సమావేశమై చర్చించారు. ఫిబ్రవరిలో జీయర్ ఆశ్రమంలో రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ, సంబంధిత ఏర్పాట్లపై కూడా సీఎం చర్చించారు.
యాగం సమయంలో నిరంతరాయంగా విద్యుత్
ఆశ్రమంలో యాగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. అయితే ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. యాగం సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. మిషన్ భగరీథ నీరు అందించాలని అధికారులకు సూచించారు. యాగానికి సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. యాగశాల వద్ద ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు.
యాగానికి వీఐపీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వసతి, మెరుగైన సేవలందించేందుకు రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమతామూర్తి విగ్రహాన్ని సీఎం పరిశీలించారు. ఈసందర్భంగా ఆశ్రమ రుత్వికులు సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆశ్రమంలోని యాగశాలకు వెళ్లిన ముఖ్యమంత్రికి ... అక్కడ చేసిన ఏర్పాట్లపై చినజీయర్ స్వామి వివరించారు. సీఎంతో పాటు మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్, మైం హోం అధినేత రామేశ్వరరావు ఉన్నారు.
ప్రధాని కోసం బీజేపీ..
ఇక బీజేపీ సైతం యాగాల మార్గంలో పడింది. తెలంగాణ వ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్‌ని ఆందోళనకారులు అడ్డుకున్న నేపథ్యంలో భాజపా శ్రేణులు హోమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ప్రధాని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో హోమాలు నిర్వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. రేపు ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు చేపట్టాలని శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ అల్కాపురిలోని శృంగేరి మఠం ఆలయంలో నిర్వహించే మృత్యుంజయ హోమంలో సంజయ్ పాల్గొననున్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.