యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి (Yadagirigutta Lakshmi Narasimha Swamy) ఆలయంలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 27 వరకు ‘శ్రావణ మహాలక్ష్మి కోటి కుంకుమార్చన’ పూజ నిర్వహించనున్నారు. ఈ పూజలో పాల్గొనడానికి టికెట్ (Ticket) ధర రూ.2 వేలుగా నిర్ణయించారు. అయితే, ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో (Online) బుక్ చేసుకోవాలి. ఒక టికెట్ (Ticket)పై దంపతులకు మాత్రమే అనుమతి ఉంటుంది. శ్రావణమాసం (Sravana month) మొత్తం రోజుకు రెండు దఫాలుగా కోటి కుంకుమార్చన (Koti Kunkuma archana) నిర్వహించనున్నారు. భక్తులు www.yadadritemple.telangana.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి కోటి కుంకుమార్చన పూజకు సంబంధించిన టికెట్లను బుక్ చేసుకోవాలని ఈవో గీతా రెడ్డి సూచించారు. గుట్టలో అత్యాధునిక హంగులు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్‌లను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి వైటీడీఏ వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. booking.ytda.in ద్వారా లాగిన్ అయి సూట్ రూంలు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్లు వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు తెలిపారు.
30 రోజులపాటు..
ఆగస్టు 27 వరకు జరిగే కోటి కుంకుమార్చన (Koti Kunkuma archana) వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు చెప్పారు. 30 రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో 30 మంది రుత్వికులు పాల్గొని నిత్యం లక్ష్మీనామం పఠిస్తారని తెలిపారు. టికెట్ పొంది న భక్తులకు స్వామివారి శేషవస్త్రంగా కల్యాణం శెల్లా, కనుము, వంద గ్రాముల లడ్డూ అందజేస్తామని చెప్పారు. వివరాలకు 8333994015, 8333994016, 8333994018 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా..
ఇక యాదాద్రి ఆలయం విషయానికొస్తే.. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆగమ, వైదిక నియమాలు, ఆకట్టుకునే శిల్పకళాకృతులతో ప్రపంచంలోనే అద్భుతమైన ఆలయంగా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం రూపుదిద్దుకుంది. రాజుల కాలంనాటి నిర్మాణశైలిని అనుసరిస్తూ.. జీవకళ తొణికిసలాడేలా కృష్ణ శిలలతో కూడిన అద్భుత సౌందర్య నిర్మాణం ఆవిష్కృతం అయింది. దేశంలోని నారసింహ క్షేత్రాల్లో అతిపురాతనమైన యాదగిరికొండపై కొలువైన పంచనారసింహుడి ఆలయ మహిమలు విశ్వవ్యాప్తం కానున్నాయి. దక్షిణ భారతంలోని తంజావూరు, అనంత మంగళం, మధుర, రామేశ్వరం వంటి పురాతన ఆలయాల నిర్మాణ శైలిని మించిన రాతి శిల్పాలు ఇక్కడ సిద్ధమయింది.
పునాది నుంచి శిఖరం వరకు పూర్తిగా రాతి శిల్పాలతో సాగడం యాదాద్రి (yadadri) ఆలయ నిర్మాణ విశిష్టతగా చెబుతున్నారు. రెండువేల సంవత్సరాల జీవం కలిగిన కృష్ణశిలలను ఆలయ నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. సప్తగోపురాలు, అష్టభుజి ప్రాకార మండపాలను కాకతీయుల కాలంనాటి శిలా సంపదను పోలేలా రాతి శిల్పాలను తీర్చిదిద్దారు. సింహం ముఖంగా ఉండే యాలీ పిల్లర్లు సిద్ధమయ్యాయి. వైష్ణవ ధర్మాన్ని చాటిచెప్పిన పన్నిద్దరు ఆళ్వారుల విగ్రహాలను ఏకశిలలపై చెక్కించారు.
దర్శనం పూర్తయి కొండ కిందకు వెళ్లే వరకు ప్రతి భక్తుడి పూర్తి సమాచారం మా దగ్గర ఉంటుంది. దీనివల్ల నిత్యం స్వామివారిని ఎంత మంది దర్శించుకున్నారో తెలుస్తుంది. మరో వైపు కొండపైన భక్తుల రద్దీ ఏర్పడితే కిందనే వారిని కొద్దిసేపు ఆపే వెసులుబాటు దీని ద్వారా లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. భక్తులకు అందించే క్యూఆర్ కోడ్ టోకన్లు, ఇతర సాంకేతికతను హైదరాబాద్ ఈసీఐఎల్ సంస్థ అందజేయనునుంది. భద్రత కల్పనలోనూ ఈసీఐఎల్ పాత్ర కీలకంగా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Online, Ticket, Yadadri temple, Yadagirigutta