ఫిబ్రవరిలో యాదాద్రి ఆలయం ప్రారంభం... నేనే కారు డ్రైవర్ అన్న కేసీఆర్

ప్రజల్లో భక్తి విశ్వాసాలు పెంపొందించేందుకు చిన్నజీయర్ స్వామిజీ ఎంతగానో కృషి చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు.

news18-telugu
Updated: October 28, 2019, 6:26 PM IST
ఫిబ్రవరిలో యాదాద్రి ఆలయం ప్రారంభం... నేనే కారు డ్రైవర్ అన్న కేసీఆర్
కేసీఆర్, చిన్నజీయర్ స్వామి (ఫైల్ ఫోటో)
  • Share this:
యాదాద్రిలో ప్రధాన ఆలయం నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపిన సీఎం కేసీఆర్... ఫిబ్రవరిలో భక్తులను ప్రధాన ఆలయంలోకి అనుమతిస్తామని అన్నారు. ఆ సందర్భంగా 1008 కుండాలతో మహా సుదర్శన యాగం చేస్తామని అన్నారు. ఆ కార్యక్రమాన్ని అద్భుత రీతిలో చేపడతామని మరోసారి స్పష్టం చేశారు. ముచ్చింతల్‌లో చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో జరిగిన స్వామీజీ తిరునక్షత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్... కొందరి చర్యల కారణంగా హైందవ సమాజానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళన ఎవరికీ అవసరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

ప్రజల్లో భక్తి విశ్వాసాలు పెంపొందించేందుకు చిన్నజీయర్ స్వామిజీ ఎంతగానో కృషి చేశారని కేసీఆర్ కొనియాడారు. 1986లో సిద్ధిపేటలో చిన్నజీయర్ స్వామి యాగం నిర్వహించారని... అప్పట్లో ఆయన సిద్ధిపేటలో ఉన్నన్ని రోజులు తానే ఆయనకు కారు డ్రైవర్‌గా వ్యవహరించానని కేసీఆర్ తెలిపారు. ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ స్వామీజీ ఆశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెదజీయర్ స్వామీజీపై రచించిన సత్య సంకల్ప పుస్తకాన్ని జీయర్ స్వామీ కేసీఆర్‌కు అందించారు. అనంతరం కేసీఆర్ దంపతులను చినజీయర్ స్వామీజీ శాలువాలతో సత్కరించారు.


First published: October 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...