యాదాద్రి స్తంభాలపై ఆ బొమ్మలపై కొత్త వివాదం...

Yadadri Temple : ఇప్పటికే యాదాద్రి ఆలయ స్తంభాలపై సీఎం కేసీఆర్ చిత్రంతోపాటూ... ప్రభుత్వ పథకాల్ని చెక్కడంపై వివాదం చెలరేగుతుంటే... తాజాగా బూతు బొమ్మలు కూడా చెక్కిన ఉదంతాలు బయటపడ్డాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: September 7, 2019, 4:18 PM IST
యాదాద్రి స్తంభాలపై ఆ బొమ్మలపై కొత్త వివాదం...
యాదాద్రి దేవాలయ స్తంభాలపై అసభ్యకర చిత్రాలు
  • Share this:
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అత్యద్భుతంగా నిర్మిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు చిక్కుల్లో పడుతోంది. కొత్తగా నిర్మిస్తున్న ఆలయ స్తంభాలపై ఇప్పటికే కేసీఆర్ ముఖం, కారు గుర్తుతోపాటూ... ప్రభుత్వ పథకాల్ని చెక్కిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై కాంగ్రెస్, బీజేపీ సహా ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అప్రమత్తమైన ప్రభుత్వం వాటిని తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. ఐతే... తాజాగా మరో విషయం బయటపడింది. అవే స్తంభాలపై బూతు బొమ్మలు కూడా ఉండటం కొత్త వివాదానికి దారితీసింది. ఆలయాలపై బూతు బొమ్మలు ఉండటం సహజమే. కాకపోతే... అవి అత్యంత అందంగా... ఎంతో శిల్పకళానైపుణ్యంతో ఉంటాయి. వాటిని చూస్తే... బూతు బొమ్మలు చూస్తున్న ఫీలింగే భక్తులకు కలగదు. ఎందుకంటే... ఆ బొమ్మల శిల్పాకృతి వాటిని భక్తి మార్గంలోకి మళ్లిస్తుంది. కానీ... యాదాద్రి స్తంభాలపై చెక్కుతున్న శిల్పాలు ఏమాత్రం అందంగా లేకపోవడమే కాదు... అవి పచ్చి బూతుబొమ్మలని క్లియర్‌గా అర్థమవుతోంది. మహిళల్ని కించపరుస్తున్నట్లుగా అవి ఉండటంపై మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

యాదాద్రి దేవాలయ స్తంభాలపై అసభ్యకర చిత్రాలు


యాదాద్రి దేవాలయ స్తంభాలపై అసభ్యకర చిత్రాలు


నిజానికి యాదాద్రి ఆలయ నిర్మాణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే... నల్లరాతితో చెక్కుతున్న ఆ శిల్పాల్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివస్తున్నారు. అందువల్ల ఆలయ ప్రతిష్ట మరింత పెరిగింది. అలాంటి సమయంలో... ఇలాంటి వివాదాలు ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: September 7, 2019, 1:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading