హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR : యాదాద్రి ప్రారంభోత్సంపై సీఎం కేసిఆర్ కీలక ప్రకటన

CM KCR : యాదాద్రి ప్రారంభోత్సంపై సీఎం కేసిఆర్ కీలక ప్రకటన

యాదాద్రి ఆలయం

యాదాద్రి ఆలయం

CM KCR : యాదాద్రి టెంపుల్ ప్రారంభోత్సంపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. నవంబర్ 2 లేదా డిసెంబర్‌ నెలలో ప్రాభించనున్నట్టు చెప్పారు. ఇందుకోసం ప్రధాని మోదీని కూడా రానున్నట్టు ఆయన ప్రకటించారు.

  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ( Telangana assembly ) మాట్లాడని సీఎం కేసీఆర్ ( cm kcr ) యాదాద్రి దేవాలయం ( yadadri temple ) ప్రారంభోత్సవంపై కీలక ప్రకటన చేశారు. నూతన దేవాలయాన్ని నవంబర్ రెండవ తేదీ లేదా డిశంబర్‌ మాసంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా యాదాద్రి దేవాలయాన్ని జీనజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారని చెప్పారు. ఇక ఈ టెంపుల్ నిర్మాణాన్ని పలువురు ప్రముఖులు దర్శించి ప్రశంసిస్తున్నారని చెప్పారు. ఇటివల పీఎం మోదీ సైతం యాదాద్రీ నిర్మాణంపై అసక్తి కనబరిచారని , దీంతో ఆలయ ప్రారంభోత్సవానికి వస్తానని చెప్పారని తెలిపారు.

  ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆలయాలకు నిధులు సమకూరుస్తున్నామని ఈ సంధర్భంగా చెప్పారు. నగరంలో నిర్మించే అన్ని పండగలకు నిధులు సమకూర్చి ఆలయాలను ముస్తాబు కూడా చేసి ఇస్తుందని చెప్పారు.. ఈ క్రమంలోనే వేములవాడ దేవాలయానికి ( Vemulawada ) గత ప్రభుత్వాలు ఎవరు చేయని విధంగా తానే స్వయంగా సందర్శించి 35 ఎకరాల భూమికి సేకరించి ఇచ్చామని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలోని శాంషాబాద్‌లోని ముచ్చింతలలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామానుజాచార్యుల విగ్రహం ప్రతిష్టాపన కూడా జరుగుతుందని చెప్పారు. ఇలా రాష్ట్రంలో అన్ని మతాల వారికి సరైన గౌరవం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో మజీదుతోపాటు హిందూ దేవాలయం కూడా నిర్మిస్తామని చెప్పారు.

  ఇది చదవండి : ముగిసిన నామినేషన్ల పర్వం మొత్తం నామినేషన్లు.. ఎన్నంటే...

  అంతకుముందు అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసిఆర్ మరోసారి కేంద్ర నిధులపై స్పందించారు.   కేంద్ర తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం డబుల్ గా ఉందని చెప్పారు. కేంద్రమే అప్పుల్లో కూరుకుకుపోయిన సమయంలో రాష్ట్రానికి అదనపు నిధులు ఎక్కడ నుండి ఇస్తుందని అన్నారు. ఇక రాష్ట్రానికి రాజ్యంగబద్దంగా రావాల్సిన నిధులు మాత్రమే వస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి 2 లక్షల 74 వేల కోట్లను పన్నుల రూపంలో ఇచ్చిందని అందుకు బదులుగా సగం నిధులు కూడా రాష్ట్రానికి రాలేదని చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రమే కేంద్రానికి నిధులు ఇస్తుంది తప్ప, కేంద్రం నుండి  తెలంగాణకు నిధులు లేవని చెప్పారు. దేశానికి నిధులు సమకూర్చే నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని చెప్పారు. ఇందుకు సంబంధంచి అనేక ఆర్థిక సంస్థలు కూడా తెలంగాణను ప్రశంసిస్తున్నాయని పేర్కొన్నారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: CM KCR

  ఉత్తమ కథలు