Yadadri Temple: యాదాద్రి ఆలయానికి భారీగా బంగారం విరాళాలు.. ఎవరెవరు ఎంత ఇచ్చారంటే..

యాదాద్రి ఆలయం

Yadadri Temple: వచ్చే ఏడాది మార్చి 28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ ఉంటుంది. నరసింహ స్వామి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపుతామని సీఎం కేసీఆర్ తెలిపారు.

 • Share this:
  యాదాద్రి  లక్ష్మీ నరసింహస్వామి (Yadadri Sri Lakshmi Narasimha Swamy) ఆలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.  ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం రాజకీయ నేతలు, వ్యాపార ప్రముఖులతో పాటు సాధారణ ప్రజలు కూడా బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారు.  మంగళవారం యాదాద్రిలో పర్యటించిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR).. ఆలయ ప్రారంభానికి ముహూర్తం ప్రకటించిన విషయం తెలిసిందే.  ఆ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటనచేశారు.  యాదాద్రి ఆలయ పునః నిర్మాణంలో భాగంగా గర్భాలయ విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించారు.  ఈ పుణ్యకార్యంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తామని చెప్పారు.  స్వర్ణతాపడానికి సుమారు దాదాపు 125 కిలోల బంగారం అవసరం అవుతుంది.  అందుకు సుమారు రూ. 60 కోట్లు ఖర్చవుతుంది. ఈ క్రమంలోనే దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. తమ కుటుంబం నుంచి తొలి విరాళంగా కిలో 16 తులాల బంగారం స్వామి వారికి అందిస్తున్నామని సీఎం కేసీఆర్ ఇది వరకే తెలిపారు.

  స్వామి వారి భక్తులు ఎవరైనా సరే రూ.11 ఇచ్చినా తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 12 వేల 769 గ్రామపంచాయతీలు ఉన్నాయని, ఆ గ్రామాల్లో పూజలు చేసి డబ్బు ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామం నుంచి రూ.11 వచ్చినా సరిపోతుందని, ఆ డబ్బుతో రిజర్వ్ బ్యాంక్ నుంచి బంగారం కొంటామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో యాదాద్రి ఆలయానికి విరాళాలు వెల్లువెత్తున్నాయి.

  CM KCR: సీఎం కేసీఆర్‌పై సంచలన సర్వే.. జనం అంత కోపంగా ఉన్నారా? 2023లో ఏం జరగనుంది?

  మంత్రి మల్లారెడ్డి కుటుంబం నుంచి ఒక కేజీ, మేడ్చల్ నియోజకవర్గం నుంచి కేజీ బంగారాన్ని ప్రకటించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి రెండు కేజీల బంగారం ఇవ్వనున్నారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజల తరపు కిలో బంగారం ఇస్తున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కావేరి సీడ్స్ తరపున భాస్కర్ రావు కేజీ బంగారం ఇస్తారని చెప్పారు. జీయర్ పీఠం నుంచి కేజీ బంగారం రానుంది. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మైనంపల్లి హన్మంతరావు, మాధవరం కృష్ణారావు, వివేకానంద్‌, ఎమ్మెల్సీలు కె.నవీన్‌ కుమార్‌, శంభీపూర్‌ రాజు ఒక్కో కేజీ బంగారాన్ని స్వామి వారికి విరాళంగా ప్రకటించారు. తెలంగాణ నుంచే ఏపీ నుంచి కూడా యాదాద్రి పుణ్యక్షేత్రానికి విరాళాల అందుతున్నాయి. కడప జిల్లా చిన్న మండెం జడ్పీటీసీ సభ్యురాలు, వ్యాపారవేత్త మోడెం జయమ్మ ఒక్కొక్కరు కిలో బంగారం చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఇక హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మ‌న్ పార్థ‌సార‌ధి రెడ్డి ఏకంగా 5 కిలోల బంగారం ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చారు. త‌న కుటుంబం త‌ర‌పున ఈ విరాళం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మొత్తంగా తొలి రోజే 22 కిలోల బంగారం సమకూరింది.

  K Chandrashekar Rao: హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ సభ ఉంటుందా? లేదా?

  కాగా, వచ్చే ఏడాది మార్చి 28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ ఉంటుంది. నరసింహ స్వామి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపుతామని సీఎం కేసీఆర్ తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణకు ఎనిమిది రోజుల ముందు మహా సుదర్శనయాగం ఉంటుందని వెల్లడించారు. కన్నుల పండవలా యాదాద్రి పున: ప్రారంభం వేడుకను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: