హోమ్ /వార్తలు /తెలంగాణ /

Yadadri : సాయంత్రం నుండే యాదాద్రికి భక్తులు.. ప్రధాన ఆలయం ప్రారంభోత్సవం..

Yadadri : సాయంత్రం నుండే యాదాద్రికి భక్తులు.. ప్రధాన ఆలయం ప్రారంభోత్సవం..

Yadadri : యాదాద్రి ప్రధాన ఆలయం నేడు ప్రారంభోత్సవం కానుంది. గత వారం రోజులుగా జరుగుతున్న ప్రత్యేక పూజలు నేటితో ముగియనుండడంతో సాయంత్రం నాలుగు గంటలకు సాధారణ భక్తుల 
దర్శనాలకు అవకాశం కల్పించనున్నారు. సీఎం కేసీఆర్ దంపతులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక 
పూజలు నిర్వహించనున్నారు.

Yadadri : యాదాద్రి ప్రధాన ఆలయం నేడు ప్రారంభోత్సవం కానుంది. గత వారం రోజులుగా జరుగుతున్న ప్రత్యేక పూజలు నేటితో ముగియనుండడంతో సాయంత్రం నాలుగు గంటలకు సాధారణ భక్తుల దర్శనాలకు అవకాశం కల్పించనున్నారు. సీఎం కేసీఆర్ దంపతులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Yadadri : యాదాద్రి ప్రధాన ఆలయం నేడు ప్రారంభోత్సవం కానుంది. గత వారం రోజులుగా జరుగుతున్న ప్రత్యేక పూజలు నేటితో ముగియనుండడంతో సాయంత్రం నాలుగు గంటలకు సాధారణ భక్తుల దర్శనాలకు అవకాశం కల్పించనున్నారు. సీఎం కేసీఆర్ దంపతులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

ఇంకా చదవండి ...

  ఈ క్రమంలోనే ఉదయం 9:30 నుంచి బాలాలయం నుంచి అందరి సమక్షంలో ప్రధానాలయానికి స్వామి వారి శోభాయాత్ర నిర్వహిస్తారు. 11: 55 నిమిషాలకు మిథున లఘ్న శుభ ముహూర్తంలో ఏక కాలంలో 92 స్థానాల్లో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రధాన ఆలయ ప్రవేశం, స్వర్ణ ధ్వజస్తంభ సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం 12.20 నుండి 12.30 గంటల వరకు స్వామివారి గర్భాలయ దర్శనం ఉంటుంది.శ్రీ శిఖరం నుంచి కిందికి వచ్చాక ప్రధానాలయంలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి వారికి మొదటి పూజ చేస్తారు.అనంతరం మహానివేదన, మొదటి తీర్ధ ప్రసాద గోష్ఠి నిర్వహిస్తారు.ఆ తర్వాత సీఎం కేసీఆర్‌కు అర్చకులు మహదాశీర్వచనం అందజేయనున్నారు.సాయంత్రం శాంతి కళ్యాణ మహోత్సవం తర్వాత భక్తులకు స్వయంభువుడి దర్శనాలను కలుగజేస్తారు కాగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఆలయ విస్తరణ నిర్మాణం చేపట్టడంతో ఐదేళ్ల తర్వాత స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. కృష్ణశిలలతో ఆలయ నిర్మాణం జరిగింది. అద్భుతమైన శిల్పాలతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన తర్వాత సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం మొదలుకానుంది.

  సాయంత్రం 4 గంటలకు సర్వదర్శనం

  సాయంత్రం 4 గంటల నుంచి భక్తులకు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దర్శనాలు కల్పించనున్నారు. దీంతో యాదాద్రిలో ఆధ్మాత్మిక శోభ ఉట్టి పడుతోంది. గత ఆరేళ్లలో బాలాలయంలో సాధారణ రోజుల్లో 8 వేల మంది వరకు.. సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 30, 40 వేల వరకు దర్శించుకున్నారు. ఇప్పుడు ప్రధానాలయం, స్వయంభూ మూర్తి దర్శనం మొదలైతే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

  బ్రేక్ దర్శనాలు

  సాధారణ భక్తులకు దర్శనం ఇవ్వనున్న లక్ష్మిలక్ష్మినరసింహుడి దర్శనానికి సంబంధించి టీటిడి తరహాలోనే బ్రేక్ దర్శనాలు, ఆన్‌లైన్ దర్శనాలు ఇవ్వనున్నట్టు ఆలయ ఇప్పటికే ఈవో తెలిపారు. మరోవైపు గుట్టపైకి కేవలం బస్సుల్లో వచ్చే వారికే దర్శనం కల్గించనున్నారు. ఇందుకోసం 60 బస్సులకు పైగా సిద్దం చేశారు..ఇక దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి పార్కింగ్ స్థలాన్ని గుట్టకిందే ఏర్పాటు చేశారు. అక్కడి నుండి నేరుగా బస్సుల్లో భక్తులను గుట్టపైకి తరలిస్తారు. ఇక ప్రతి భక్తుడికి క్యూఆర్ కోడ్ ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు.

  First published:

  Tags: Hyderabad, Yadadri temple

  ఉత్తమ కథలు