హోమ్ /వార్తలు /తెలంగాణ /

Yadadri:టీటీడీ తరహాలోనే యాదాద్రి ఆలయ బోర్డు..తెరపైకి కొత్త అంశం

Yadadri:టీటీడీ తరహాలోనే యాదాద్రి ఆలయ బోర్డు..తెరపైకి కొత్త అంశం

Yadadri:తెలంగాణ తిరుమలగా రూపుదిద్దుకుంటోంది యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయం. ఆలయ అభివృద్ది పనులు శరవేగంగా పూర్తి చేసింది ప్రభుత్వం. అయితే త్వరలోనే టీటీడీ తరహాలోనే యాదాద్రి ఆలయ బోర్డు ఏర్పాటు చేస్తారనే వార్తలు కూడ బయటకువస్తున్నాయి.

Yadadri:తెలంగాణ తిరుమలగా రూపుదిద్దుకుంటోంది యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయం. ఆలయ అభివృద్ది పనులు శరవేగంగా పూర్తి చేసింది ప్రభుత్వం. అయితే త్వరలోనే టీటీడీ తరహాలోనే యాదాద్రి ఆలయ బోర్డు ఏర్పాటు చేస్తారనే వార్తలు కూడ బయటకువస్తున్నాయి.

Yadadri:తెలంగాణ తిరుమలగా రూపుదిద్దుకుంటోంది యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయం. ఆలయ అభివృద్ది పనులు శరవేగంగా పూర్తి చేసింది ప్రభుత్వం. అయితే త్వరలోనే టీటీడీ తరహాలోనే యాదాద్రి ఆలయ బోర్డు ఏర్పాటు చేస్తారనే వార్తలు కూడ బయటకువస్తున్నాయి.

ఇంకా చదవండి ...

తెలంగాణ (Telangana)తిరుమలగా రూపుదిద్దుకుంటోంది యాదాద్రి(Yadadri)లోని లక్ష్మినరసింహస్వామి దేవస్థానం. నూతన హంగులు, భక్తులకు దివ్యనుగ్రహం కలిగించే ఆలయ నిర్మాణం, ప్రాకారాలను అత్యద్బుతంగా పునర్‌నిర్మాణం చేసింది ప్రభుత్వం. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న లక్ష్మినరసింహస్వామి(Lakshminarasimhaswamy)దేవస్ధానం ఆలయ బోర్డును ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (Chandrasekhar Rao)ఏర్పాటు చేస్తారా లేదా అనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఈ ఆలోచన ఇప్పటికే ఆలయ అధికారులు, కేబినెట్ మంత్రులు, టిఆర్ఎస్ (trs)ఎమ్మెల్యేల మదిలో ఉందని సమాచారం. ప్రస్తుతం ఆలయం తెలంగాణ దేవాదాయ శాఖ నిర్వహిస్తున్నప్పటికీ, సంప్రదాయ ఆచార వ్యవహారాలు, ఆచార వ్యవహారాలు, యాదాద్రి ఆలయ ఆస్తులు సజావుగా సాగేందుకు ప్రత్యేక ఆలయ బోర్డు అవసరమని వైష్ణవ ఆలయ సీనియర్‌ పూజారి రంగరాయ శర్మ భావిస్తున్నారు. యాదాద్రి దేవస్థానం బోర్డు ఏర్పాటు చేస్తే ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న వ్యక్తులే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలను సభ్యులుగా నియమించవచ్చని అధికారికంగా వినిపిస్తున్న మాట. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం (ttd)తరహాలోనే లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం (SNLSD)ఆలయ బోర్డు ఏర్పాటు చేస్తారనే మాట వినిపిస్తోంది.

టీటీడీ తరహాలోనే యాదాద్రి ఆలయ బోర్డు..

తెలంగాణే తలమానికమైన యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దేవస్థానం పునః ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో ఆధునిక వసతులు, అద్భుత కట్టడాలతో రూపుదిద్దుకుంటోంది. ఏపీలో తిరుమల తిరుపతికి తీసిపోని విధంగా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారు. అన్నదానం, లడ్డుల తయారీ, భక్తుల క్యూ కాంప్లెక్స్, వసతి గ్రుహాలు.. ఇలా తిరుమల తరహాలో అన్ని ఏర్పాటు చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం (SNLSD) తెలంగాణ దేవాదాయ శాఖ, కార్యనిర్వాహక అధికారిచే నిర్వహించబడుతోంది. ఆలయ ఆర్జిత సేవలు, బ్రహ్మోత్సవాలు ఇతర దాతల పథకాలను పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం శివాలయం (పర్వతవర్ధిని శ్రీ రామలింగేశ్వర స్వామి) , పాతగుట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంతో సహా రెండు ఉప ఆలయాలు( SNLSD) అధికార పరిధిలోకి వచ్చాయి.

ఏర్పాటు చేసే యోచనలో సర్కారు..

కేసీఆర్ నిర్ణయంతో ఇప్పుడు కొండపైన ఉన్న యాదాద్రి ఆలయ సముదాయం, దిగువ ప్రాంతం పూర్తిగా అద్భుతమైన టెంపుల్ టౌన్‌గా రూపాంతరం చెందింది. సోమవారం నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ పర్వాలను ప్రారంభించారు. స్వామివారి జన్మనక్షత్రం స్వాతినక్షత్రం సందర్భంగా ఉదయం 4 గంటలకు బ్రహ్మీ ముహూర్తంలో 108 కలశాలతో ఘటాభిషేకం నిర్వహించారు. ఆల‌య ఉద్ఘాట‌న‌లో భాగంగా రెండో రోజు ఈ క్ర‌తువుల‌ను నిర్వ‌హిస్తున్నారు.ఉత్సవమూర్తులను సమ్మోహనంగా అలంకరించి బాలాలయంలో ఆస్థానింపజేశారు.

సర్వాంగ సుందరంగా..

మంగళవారం ఉదయం 9 గంటల నుంచి.. శాంతిపాఠం, అవధారలు, యాగశాలలో చతుస్థానార్చన,ద్వారా తోరణ ధ్వజ కుంభారాధనలు, అగ్ని మధనం, అగ్ని ప్రతిష్ఠ, యజ్ఞం ప్రారంభం, విశేష యజ్ఞ హవనములు, మూలమంత్ర హవనములు, నిత్యలఘు పూర్ణాహుతి నిర్వ‌హిస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి.. సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, నిత్య విశేష హోమాలు, బింబ పరీక్ష, మన్నోమాన శాంతిహోమం, నవకలశ స్నపనం, నిత్య లఘు పూర్ణాహుతి నిర్వ‌హించ‌నున్నారు.

First published:

Tags: CM KCR, Telangana, Yadadri temple

ఉత్తమ కథలు