కాలినడకనే గుట్ట పైకి.. ఈ నెల 8 నుంచి యాదగిరిగుట్ట నారసింహుడి దర్శనం..

భక్తుల రాకకోసం యాదగిరిగుట్ట సకల సౌకర్యాలతో సన్నద్ధమవుతోంది. ఈ నెల 8 నుంచి శ్రీలక్ష్మీ నారసింహుడి దర్శనం కోసం భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు సాగుతున్నాయి.

news18-telugu
Updated: June 3, 2020, 2:21 PM IST
కాలినడకనే గుట్ట పైకి.. ఈ నెల 8 నుంచి యాదగిరిగుట్ట నారసింహుడి దర్శనం..
యాదాద్రి టెంపుల్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భక్తుల రాకకోసం యాదగిరిగుట్ట సకల సౌకర్యాలతో సన్నద్ధమవుతోంది. ఈ నెల 8 నుంచి శ్రీలక్ష్మీ నారసింహుడి దర్శనం కోసం భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆర్జిత పూజల నిర్వహణకు కూడా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, భక్తులు కాలినడకనే గుట్ట మీదకు చేరుకోవాల్సి ఉంటుంది. గుట్ట పైకి ఎలాంటి వాహనాలకు అనుమతి ఇవ్వరు. యాదాద్రిలో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆలయ ఈవో గీత ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. గుట్ట కింది నుంచి పైదాకా నడుచుకుంటూ వెళ్లే భక్తులు భౌతిక దూరం పాటించేలా నిర్ణీత బాక్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. ముందుగా వారం పాటు ప్రయోగాత్మకంగా దర్శనాల ప్రక్రియను పర్యవేక్షిస్తామని చెప్పారు.

ఇక, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల కోసం ఒక్కో బ్యాచ్‌కు ఒక హాల్‌లో 50 జంటలు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. శ్రీవారి కల్యాణానికి 25 మంది దంపతులే కూర్చునేలా టికెట్లు ఇస్తామని తెలిపారు. అయితే, దర్శనాలకు పదేళ్ల లోపు పిల్లలు, 65 ఏండ్లు దాటిన వృద్ధులకు అనుమతిలేదని ఈవో గీత స్పష్టంచేశారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 3, 2020, 2:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading