యాదాద్రి లక్ష్మీ నారసింహుడి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచే..

Yadadri : యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి మార్చి 7 వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

news18-telugu
Updated: February 25, 2020, 10:35 AM IST
యాదాద్రి లక్ష్మీ నారసింహుడి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచే..
ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం
  • Share this:
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి మార్చి 7 వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 28న అలంకార వేడుకలు నిర్వహించనున్నారు. మార్చి 3న ఎదుర్కోలు, 4న తిరుకల్యాణం, 5న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం, 7న అష్టోత్తర శత ఘటాభిషేకం జరగనుంది. ప్రధాన ఆలయ విస్తరణ పనులు జరుగుతుండటంతో బాలాలయంలోనే ఉత్సవాలు నిర్వహించనున్నారు. అటు.. మార్చి 2 నుంచి 7 వరకు యాదాద్రిలో సాంస్కృతిక ఉత్సవాలు కూడా జరగనున్నాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈ నెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు శాశ్వత, మొక్కు కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: February 25, 2020, 10:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading