యాదాద్రి స్తంభాలపై ఆ రెండూ తొలగించిన అధికారులు

లయ స్తంభాల్లో కేసీఆర్ కిట్, హరితహారం పదాలను తొలగించింది. అయితే, వాటిపైన ఉన్న పథకాల చిత్రాలను మాత్రం అలాగే ఉంచింది.

news18-telugu
Updated: September 7, 2019, 3:16 PM IST
యాదాద్రి స్తంభాలపై ఆ రెండూ తొలగించిన అధికారులు
యాదాద్రి ఆలయ అష్టభుజి ప్రాకారంపై కేసీఆర్ ముఖచిత్రం (File)
  • Share this:
యాదాద్రి ఆలయంలో స్తంభాలపై రాజకీయ చిత్రాల మీద తీవ్ర ఎత్తున విమర్శలు రావడంతో వైటీడీఏ చర్యలు తీసుకుంది. ఆలయ స్తంభాల్లో కేసీఆర్ కిట్, హరితహారం పదాలను తొలగించింది. అయితే, వాటిపైన ఉన్న పథకాల చిత్రాలను మాత్రం అలాగే ఉంచింది. కేసీఆర్ ఫొటోను కూడా కొనసాగించింది. యాదాద్రిలోని బాహ్య ప్రాకారంలో ఏర్పాటు చేసిన స్తంభాల్లో పలు చిత్రాలు ఉన్నాయి. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు, కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు కేసీఆర్ కిట్, హరితహారం‌తోపాటు మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, కేసీఆర్, కమలం, సైకిల్, ఎడ్లబండి వంటి చిత్రాలను గీశారు. సుమారు 5వేల చిత్రాలను గీస్తే... అందులో రాజకీయ చిత్రాలు ఉండడం వివాదాలకు దారితీసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాచరికం తరహాలో వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, శిల్పులకు తామేమీ చెప్పి చెక్కించలేదని యాదాద్రి ఆలయ అభివృద్ధి అథారిటీ వైస్ చైర్మన్ కిషన్ రావు స్పష్టం చేశారు. ఎవరైనా అభ్యంతరాలు చెబితే వాటిని పరిశీలించి అవసరం అనిపిస్తే చిత్రాలను తొలగిస్తామన్నారు. మరోవైపు కేసీఆర్‌ను శిల్పి దేవుడిలా భావించబట్టే సీఎం చిత్రాన్ని చెక్కి ఉంటారని ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి అన్నారు.

First published: September 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...