YADADRI BHUVANAGIRI TWO FAMILIES FIGHT OVER PROPERTY ISSUE IN YADADRI BHUVANAGIRI DISTRICT NLG NJ PVN
Fighting: భూ తగాదా..కర్రలతో దాడి చేసుకున్న రెండు కుటుంబాలు!
ఇరు కుటుంబ సభ్యులు కర్రలతో దాడి!
యాదాద్రి భువనగిరి జిల్లాలో భూతగాదాల కారణంగా రెండు కుటుంబాల మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరాయి. ఒకరినొకరు కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లారు. ఈ ఘర్షణలో పలువురు గాయాలపాలయ్యారు.
Two families fight over Property Issue: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జంపల్లి చందు నాయక్ తండాలో భూ తగాదాలు భగ్గుమన్నాయి. పన్నెండు ఎకరాల భూమి విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయి.
రెండు బంజారా కుటుంబాల మధ్య కొన్ని నెలలుగా భూవివాదం కొనసాగుతోంది. 12 ఎకరాల భూవివాదం ఇరుకుటుంబాల మధ్య మాటలయుద్ధం నుంచి కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. పొలంలో రెండు కుటంబాలకు చెందిన వాళ్లు.. కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో దాదాపు 15మందికి పైగా ఉండగా.. అందులో కొందరు మహిళలు కూడా ఉన్నారు. వారు సైతం కర్రలు తీసుకుని ఎగబడ్డారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు తీవ్రగాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.