హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana politics : వచ్చే నెల 2నుంచి బండి సంజయ్ పాదయాత్ర .. అక్కడ బహిరంగ సభతో యాక్షన్‌ ప్లాన్ స్టార్ట్

Telangana politics : వచ్చే నెల 2నుంచి బండి సంజయ్ పాదయాత్ర .. అక్కడ బహిరంగ సభతో యాక్షన్‌ ప్లాన్ స్టార్ట్

BANDI SANJAY(FILE)

BANDI SANJAY(FILE)

Telangana | Bandi sanjay: తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. ఆపరేషన్ ఆకర్ష్‌తో పాటు పాదయాత్రలు, ప్రజాగోస-బీజేపీ భరోసా వంటి కార్యక్రమాలతో ఎన్నికల వేడిని ఏడాదికి ముందుగానే పుట్టిస్తున్నారు. దీని వెనుక కమలనాథుల యాక్షన్ ప్లాన్‌ ఏంటో తెలుసా.

ఇంకా చదవండి ...

(P.Srinivas,New18,Karimnagar)

తెలంగాణలో బీజేపీ(BJP)దూకుడు పెంచింది. ఆపరేషన్ ఆకర్ష్‌తో పాటు పాదయాత్రలు, ప్రజాగోస-బీజేపీ భరోసా వంటి కార్యక్రమాలతో ఎన్నికల వేడిని ఏడాదికి ముందుగానే పుట్టిస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay)ప్రజా సంకల్పయాత్ర మూడో విడత ఆగస్టు(August)2నుండి.. యాదాద్రి(Yadadri)నుండి హన్మకొండ(Hanmakonda)వరకు సాగనున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. ఐదు జిల్లాల్లోని 12 నియోజకవర్గాలను కవర్ చేస్తూ .. 328 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. మొత్తం 24 రోజులపాటు కొనసాగనుంది.

Telangana : పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం .. ఐదుగురు కార్మికులు మృతిపాదయాత్రకు ప్లాన్ ఇదే..

లక్ష్మీ నరసింహుడు కొలువుదీరిన యాదాద్రిలో స్వామివారి ఆశీర్వాదం తీసుకుని బండి సంజయ్ ఈ యాత్రను ప్రారంభించనున్నారు. వరంగల్లోని భద్రకాళి ఆలయం వరకు మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది. గతంలో చేసిన రెండు యాత్రలకు విభిన్నంగా చారిత్రక , తెలంగాణ సాయుధ , ఉద్యమ పోరాటాల నేపథ్య ప్రాంతాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది. జనం గోస వినడం .. ప్రజలకు భరోసా ఇవ్వడంతో పాటు తెలంగాణలో రాబోయేది భాజపా సర్కారేననే సంకేతాలు పంపడమే యాత్ర లక్ష్యంగా బండి ముందుకు వెళ్తున్నారు. బండి సంజయ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో శ్రేణులు నిమగ్నమయ్యాయి. యాదాద్రి భువనగిరి , నల్గొండ , జనగాం , వరంగల్ , హన్మకొండ జిల్లాల మీదుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వెళ్లనున్నారు. ముఖ్యంగా ఈసారి బండి సంజయ్ పాదయాత్రలో మునుగోడులో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగానే బీజేపీలో చేరికలే లక్ష్యంగా పాదయాత్రను ప్లాన్ చేస్తున్నారు.

ఆ ఐదు జిల్లాలే టార్గెట్..

ఐదు జిల్లాల్లోని ఆలేరు , భువనగిరి , మునుగోడు , నకిరేకల్ , తుంగతుర్తి , పాలకుర్తి , స్టేషన్ ఘన్పూర్ , జనగాం , వర్ధన్నపేట , వరంగల్ తూర్పు , వరంగల్ పశ్చిమతో కలిపి మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది. మొత్తం 25 మండలాల మీదు యాత్ర సాగుతుంది . మొత్తంగా 328 కిలోమీటర్లు బండి సంజయ్ నడువనున్నారు . మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర అనేక చారిత్రాక ప్రదేశాల గుండా కొనసాగనుంది . చేనేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి , రజాకార్ల అరాచకాలకు మూకుమ్మడిగా బలైన గుండ్రాంపల్లి , చాకలి ఐలమ్మ పోరు సాగించిన విసునూరు , సర్వాయి పాపన్న పాలనా రాజధాని ఖిలాషాపూర్ , తెలంగాణ సాయుధ పోరాట చైతన్య వేదిక కొత్తపేటతో పాటు ఐనవోలు మల్లన్న ఆలయ ప్రదేశాల మీదుగ ప్రాంతాల మీదుగా యాత్ర చేయనున్నారు.

Crime news : భర్తకు విడాకులు ఇప్పించాడు .. ఆ తర్వాత ఆమెను ప్రియుడు ఏం చేశాడో తెలుసా..!  బహిరంగసభపైనే సందిగ్ధం ..!

బండి సంజయ్ పాదయాత్రలోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు పార్టీ శ్రేణుల్ని భారీగా బీజేపీలోకి చేర్చుకొని..అటు కాంగ్రెస్‌, ఇటు టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోంది. కాని రాజగోపాల్‌రెడ్డి మాత్రం అగస్ట్‌ 7వ తేది వరకు తనకు సమయం ఇవ్వాలని బీజేపీ హైకమాండ్‌ని కోరడంతో మునుగోడులో బహిరంగ సభ ఉంటుందా ? లేదా ? అనే సందిగ్ధం కొనసాగుతోంది. కోమటిరెట్టి బ్రదర్స్‌లో రాజగోపాల్‌రెడ్డి పార్టీ కాంగ్రెస్‌ని వీడుతుంటే..వెంకట్‌రెడ్డి మాత్రం దసరా తర్వాత తాను కూడా పాదయాత్రను చేపట్టే యోచనలో ఉంటారు.

First published:

Tags: Bandi sanjay, Bjp, Telangana Politics

ఉత్తమ కథలు