హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : అమ్మాయిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని ఆమె తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసా..?

Telangana : అమ్మాయిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని ఆమె తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

OMG: తమ అమ్మాయిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకున్నారు. అమ్మాయి కుటుబం సభ్యులు చేసిన పనికి గ్రామస్తులు కూడా సమర్ధిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda, India

పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చాలా చోట్ల అమ్మాయి, లేదంటే అబ్బాయిపై దాడి చేయడం లేదంటే పోలీస్ కేసు(Police case) పెట్టడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri)జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. తమ అమ్మాయిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకున్నారు. అమ్మాయి కుటుబం సభ్యులు చేసిన పనికి గ్రామస్తులు కూడా సమర్ధిస్తున్నారు.

Hyderabad : దసరా పండగకు ఊరెళ్తున్నారా .. రాచకొండ పోలీసులు చెప్పినట్లు చేయకపోతే మీకే డేంజర్

పెద్దలకు చెప్పకుండా ..

ప్రేమ వ్యవహారాలు ప్రేమించుకున్న వాళ్ల ప్రాణాలకే కాదు ..కుటుంబ సభ్యుల పీకల మీదకు తెస్తున్నాయి. అంతటితో ఆగకుండా వారి ఆస్తుల ధ్వంసానికి తెర తీరుస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో యువకుడు ప్రేమించిన అమ్మాయిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అటుపై వాళ్ల పెళ్లి ఫోటోలు గ్రామస్తులకు తెలిసేలా వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయడంతో పెద్ద ప్రమాదమే జరిగింది. తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన వేముల భాను అనే యువకుడు అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. యువతికి కూడా ఇష్టం కావడంతో ఇద్దరూ కలిసి శుక్రవారం ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు.

లేచిపోయి పెళ్లి చేసుకున్నారు..

నచ్చిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్న వేముల భాను తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను గ్రామానికి చెందిన టీఆర్ఎస్‌ పార్టీ వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్ చేశాడు. దాంతో అమ్మాయి కుటుంబ సభ్యులు కోపంతో రగిలిపోయారు. తమ బిడ్డను అమాయకురాలిని చేసి ఎత్తుకెళ్లడమే కాకుండా పెళ్లి చేసుకొని ఫోటోలు పంపించాడనే అనే ఆగ్రహంతో భాను ఇంటిని తగలబెట్టారు. అమ్మాయి కుటుంబ సభ్యులు భాను ఇంటికి నిప్పు పెట్టిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఇంట్లో సుమారు ఆరు లక్షల విలువ చేసే సామాన్లు దగ్ధమయ్యాయి.

Telangana : మసకబారిన నాటి వైభవం .. నల్లబంగారం నిధికి మళ్లీ పాత రోజులొచ్చేనా ..!

రెచ్చగొట్టడం వల్లేనా..

గ్రామానికి చెందిన తన స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న వేముల భాను పోలీస్‌ కంప్లైంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు గ్రామస్తులు కూడా యువతి బంధువులకే మద్దతుగా మాట్లాడుతున్నారు. భాను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న అమ్మాయి మైనర్ అని పోలీసులకు తెలిపారు. అయితే ఈకేసులో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ..విచారణ పూర్తైన తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

First published:

Tags: Love marriage, Telangana News, Yadadri