హోమ్ /వార్తలు /telangana /

మీ ఫోన్ ఎవరికి పడితే వాళ్లకు ఇస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీ డబ్బులు గోవిందా..!

మీ ఫోన్ ఎవరికి పడితే వాళ్లకు ఇస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీ డబ్బులు గోవిందా..!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

నేరగాళ్లు అతని ఖాతా నుండి ఏకంగా రూ.20 లక్షలు స్వాహా చేశారు. బాధితుడు ముంబైలో కష్టపడిన సంపాదనతో గతంలో భూమి కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల క్రితం తన అవసరాల నిమిత్తం ఆ భూమిని విక్రయించాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda, India

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు మరింత పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైం అధికారులు ఎంత నిఘా పెడుతున్నా...  ఎంత అవేర్ నెస్ తీసుకువస్తున్నా అమాయకులు అన్యాయంగా మోసపోతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న ఓ మేస్త్రీ ఏకంగా రూ.20లక్షలు కోల్పోయాడు. పాపం తన భూమి అమ్మిన డబ్బులు తన అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఈ కేటుగాళ్లు రోజురోజుకీ తమ తీరు మార్చుకుంటూ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సైబర్ మోసాలపై ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ కళాప్రదర్శనలు నిర్వహిస్తూ, అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు సైబర్ నేరస్థుల బారిన పడి లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు..  నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లా లాంటి ఘటన మోత్కూర్ మండలంలో చోటు చేసుకుంది. బాధితుడు అడ్డగుడూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. బాధితుడు మోత్కూర్ ఎస్బీఐలో ఖాతా ఉన్నప్పటికీ, ఇటీవల బ్యాంకుకు వెళ్ళలేదు. ఎవరికీ తన ఓటీపీ షేర్ చేయలేదు. ఏ లింకులను తాను ఓపెన్ చేయలేదు.

కానీ నేరగాళ్లు అతని ఖాతా నుండి ఏకంగా రూ.20 లక్షలు స్వాహా చేశారు. బాధితుడు ముంబైలో కష్టపడిన సంపాదనతో గతంలో భూమి కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల క్రితం తన అవసరాల నిమిత్తం ఆ భూమిని విక్రయించాడు. వచ్చిన డబ్బును తన ఖాతాలో భద్రపరుచుకున్నాడు. తాను పని నిమిత్తం నెల రోజుల క్రితం హైదరాబాద్  వెళ్ళాడు. తిరిగి స్వంత గ్రామానికి తిరిగి వస్తుండగా, యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోలేట్లో ఫాస్టాగ్ ద్వారా టోల్ బిల్లు చెల్లించడం కోసం, తన ఫోన్ అక్కడ గుర్తు తెలియని వారికి ఇచ్చారని తెలిసింది.

అంతే ఇంకేముంది.. విడతల వారీగా ఖాతాను ఖాళీ చేశారు. అతని ఖాతాకు లింకు అయిన ఫోన్ నెంబర్‌కు మెసేజులు వెళ్లకుండా బ్లాక్ చేసి, నెల రోజుల వ్యవధిలో ఖాతా నుండి రూ.20 లక్షలు ఖాళీ చేశారు. మెసేజ్‌లు రావడం లేదని తీరా బ్యాంకులో సంప్రదించగా రోజుకు రూ.50 వేల చొప్పున దాదాపు రూ.20 లక్షలు ఖాతాలో డ్రా అయినట్లు తెలుసుకున్నాడు. ఆ వివరాలను సేకరిం చిన బాధితుడు స్థానిక పోలీసు స్టేషన్, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

First published:

Tags: Nalgonda, Telangana, Telangana News

ఉత్తమ కథలు