తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి (Srikinatha chari) 13వ వర్ధంతి నేడు. ఈ సందర్బంగా యాదాద్రి తెరాస మాజీ జనరల్ సెక్రటరీ వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ (Vattipalli Srinivas Goud) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..శ్రీకాంతా చారి 13వ వర్ధంతి నేడు. ఈ 13 ఏళ్లలో శ్రీకాంతాచారిని గుర్తు చేసుకున్న రోజులు చాలా తక్కువ అతని కుటుంబానికి చేసింది కూడా ఏమి లేదు. శ్రీకాంతా చారి మొట్టమొదటి అమరుడు. అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ నేడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధ, దుఃఖం కలుగుతుంది. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) పేరు పేపర్లో వస్తే నేను భరించలేకపోతున్నా. ఆమె అమెరికాలో కష్టపడి చదువుకొని ఇండియాకు వచ్చారు.
ఉద్యమంలో, పార్టీలో పాల్గొన్న ఆమెపై లిక్కర్ స్కాం, లాండ్ స్కాం రావడం బాధాకరం. మనం బంగారు తెలంగాణ చేద్దామంటే బంగారం తింటామా మనం. ఎందుకు ఈ చెడ్డ పేరు. ఇది మీకు మంచింది కాదు. ఇలాంటి ఘటనలతో కేసీఆర్ తలదించుకుంటాడు. రాత్రి పూట నిద్ర కూడా పోడు. కుటుంబానికి ఇలాంటి అవమానాలు వస్తే ఏ తండ్రైన బరిస్తాడా అని వట్టిపల్లి శ్రీనివాస్ (Vattipalli Srinivas Goud) అన్నారు. నిన్న కవితమ్మ (MLC Kavita) పెట్టిన ప్రెస్ మీట్ లో ఒక్కరైనా ఉద్యమంలో పాల్గొన్నారా..కనీసం జెండా పెట్టుకున్నారా అని శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇక్కడి ఆలేరు ఎమ్మెల్యే సునీత 2001లో తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తి ఆరు, ఏడు ఏళ్లలో వందల కోట్ల గురించి మాట్లాడుతున్నారు. ఇదెలా సాధ్యం. ఈ మంత్రం ఏదో ప్రజలకు కూడా చెప్పు. ప్రజలు కూడా వందల కోట్లు సంపాదించడం నేర్చుకుంటారన్నారు.
లక్ష్మి నరసింహ స్వామి (Lakshmi Narasimha Swami)ని ఇక్కడ అమ్ముతున్నారు. స్వామిని పూజించేది పోయి ల్యాండ్ మాఫియాతో వేల కోట్ల ఫ్రాడ్ జరుగుతుంది. దీనితో వీళ్లు లబ్ది పొందుతుంటే మీకు చెడ్డ పేరు వస్తుంది. లక్ష్మి నరసింహ స్వామి పేరు (Lakshmi Narasimha Swami)తో స్పెక్ట్రా అనే కంపెనీతో డీలింగ్స్ పెట్టుకొని మాఫియా నడిపిస్తున్నారు. మీరు గుర్తు పెట్టుకోండి. మిమ్మల్ని వదిలిపెట్టం. దీనికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ (Cm Kcr) కు వివరిస్తాం. అక్కడ సమాధానం లేకపోతే ఐటీ, ఈడీకి, సీబీఐకి, గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం. అక్కడ కూడా సమాధానం లేకుంటే మీ మీద కోర్టుకు కూడా వెళతామన్నారు.
నా తండ్రి తాళ్లు ఎక్కేవాడు. కానీ నేను దేవుని దయ వల్ల కొంత బాగుపడ్డా. మేము మా తెలంగాణ ఉద్యమాన్ని నమ్మినం. ప్రజలకు మంచి జరుగుతుంది. మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. రైతులలు భూములు అమ్ముకోరు పంట పండించుకుంటారు. రైతుల పంటకు మద్దతు ధర వస్తుందని అనుకున్నాం. కానీ ఇక్కడ దేవుని పేరు మీద వ్యాపారాలు చేస్తున్నారు. మిమ్మల్ని దేవుడు, ప్రకృతి పగబట్టిందని వట్టిపల్లి శ్రీనివాస్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana, Yadadri, Yadadri temple