Minster Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పర్యాటక, యువజన సర్వీస్ శాఖామంత్రి మంత్రి ఆర్కే రోజా (RK Roja) కు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతగా ప్రత్యేక గుర్తింపు ఉంది.. రాజకీయాల్లోకి రాకముందే నటిగా ఆమెకు క్రేజ్ ఉండేది.. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఫైర్ బ్రాండ్ (Fire Brand) గా.. ప్రత్యర్థికి తన పంచ్ డైలాగ్ లో పంచ్ లు వేయడంలో ముందు వరుసలో ఉండేవారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కాదు.. మంత్రి అయిన తరువాత కూడా ఆమెలో స్పీడ్ తగ్గలేదు. ఇలా రాజకీయాల్లో దూకుడుగా ఉండే ఆమెకు ఆధ్యాత్మిక భావన కూడా ఎక్కువే.. ఆమెకు మంత్రి పదవి దక్కడానికి ఆమె ఆధ్యాత్మిక చింతనే కారణమనే ప్రచారం ఉంది. ఎందుకంటే ఏపీ కేబినెట్ విస్తరణకు ముందు ఆమె సమయం చిక్కినప్పుడల్లా ప్రముఖ పుణ్యక్షేత్రాలు.. దేవాలయాలు.. పీఠాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు.. అయితే మంత్రి అయిన తరువాత సైతం తన మొక్కులు తీర్చుకుంటూనే ఉన్నారు. తన మొక్కులో భాగంగా తాజాగా యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి (Yadadri Laxmi Narasimha Swamy) కి పురాణపండ శ్రీమాలిక గ్రంధాన్ని రోజా కానుకగా సమర్పించారు. ముత్తైదువులకు కానుకగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆమె ఆ కానుక సమర్పించారు.
ఈ పురాణపండ శ్రీమాలిక ఎంతో ప్రత్యేకమైంది. భారతీయ సనాతన ధర్మం ప్రసాదించిన సర్వశక్తిమంతమైన స్తోత్ర రాజాలతో, అందమైన వ్యాఖ్యానాలతో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూపంగా రెండు వందల నలభై పేజీలతో దీన్ని అందించారు. 'శ్రీమాలిక' అద్భుత గ్రంధం రెండు వేల ప్రతులను యాదాద్రి పుణ్యక్షేత్ర (Yadadri Temple) సన్నిధానానికి ఆర్కే రోజా కానుకగా ఇచ్చారు.
శ్రావణమాసం సందర్భాన్ని పురస్కరించుకుని యాదాద్రిలో అఖండంగా నిర్వహిస్తున్న కోటికుంకుమార్చనలో పాల్గొనే ముత్తయిదువులకు కానుకగా అందించనున్నారు. అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈ మంత్ర మాలికను యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం కార్య నిర్వహణాధికారి గీతారెడ్డికి రోజా ప్రతినిధులు బుధవారం సాయంకాలం ఈ గ్రంథాలను అందజేశారు.
ఇదీ చదవండి : ఏపీకి మరో హెచ్చరిక.. ఆ తొమ్మిది జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎప్పుడంటే?
అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం తరువాత ఆలయ ముఖమండపంలో అష్టోత్తర మూర్తుల వద్ శ్రీమాలిక గ్రంథాన్ని ఆవిష్కరించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు నల్లంధీగల్ లక్ష్మీ నరసింహాచార్యులు మాట్లాడుతూ అభీష్టసిద్ధులనిచ్చే అద్భుత స్తోత్ర సంపద ఈ గ్రంధం అన్నారు. రేపటి నుంచి కుంకుమార్చనలో పాల్గొనే మహిళలకు ఈ పవిత్రగ్రంధాన్ని కూడా సమర్పిస్తున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Minister Roja, Yadadri temple