(Nagaraju, nalgonda)
యాదాద్రి భువనగిరి (Yadadri BhuvanaGiri) జిల్లా భువనగిరి మండలం యర్రంబెల్లికి చెందిన పడమటి అన్విత రెడ్డి (Padamati Anvita Reddy). ఆమె పట్టుదల ముందు ఎవరెస్ట్ శిఖరం కూడా చిన్నబోయింది. సముద్ర మట్టానికి 8.848.86 km ఎత్తులోని ఎవరెస్ట్‌ను ఐదు రోజుల్లో అధిరోహించి ఔరా అనిపించింది. అయితే ఆమె ప్రయత్నానికి ఉడుత భక్తి సాయం రూపంలో హైదరాబాద్ (Hyderabad) లోని ట్రాన్సెన్స్ అడ్వెంచర్స్ సంస్థ అధినేత శేఖర్ బాబు బాచినపల్లి శిక్షణ ప్రోత్సాహం మరువలేనిది.
అన్విత రెడ్డి (Anvitha reddy) అతి సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు పడమటి మధుసూదన్ రెడ్డి,చంద్రకళ. అన్విత భువనగిరిలోని రాక్ క్లైబింగ్ స్కూల్‌లో బేసిక్, ఇంటర్మిడియట్ , అడ్వాన్స్ ,ఇన్‌స్ట్రక్టర్ శిక్షణను పూర్తి చేసింది. పర్వతారోహణ కోర్సులను సైతం పూర్తి చేసింది.
ఎవరెస్ట్ శిఖరం ప్రయాణం ఇలా..!
హైదరాబాద్ (Hyderabad) నుంచి ఏప్రిల్ 2న ఆమె నేపాల్‌కు బయలుదేరి వెళ్లారు. నాలుగో తేదీన నేపాల్ కు చేరుకున్నారు. డాక్యుమెంట్లు పూర్తిచేసి ఖాట్మండులోని కొన్ని రోజులు గడిపారు. అక్కడి నుంచి లుక్లాకు వెళ్లారు. తొమ్మిది రోజులు కాలినడకన ఏప్రిల్ 17న ఐదు వేల మూడు వందల మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ (Mount Everest) బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. కొన్ని రోజులు పర్వతంపైకి రొటేషన్స్ పూర్తిచేశారు. ఒక భ్రమణలో ఎత్తైన శిఖరాలకు 7100 మీటర్లు ఎక్కి తర్వాత విశ్రాంతి తీసుకున్నారు.
అన్విత అనుభవజ్ఞులైన ఇద్దరు షేర్చల(గైడ్స్)తో బేస్ క్యాంపు వరకు పలుమార్లు వాతావరణాన్ని ఆక్సిజన్ హెచ్చు తగ్గులను పరిశీలించారు. మే 12న సాహస యాత్రను ప్రారంభించి వివిధ ఎత్తులతో నాలుగు పర్వతాలు దాటి ఈ నెల 16న ఉదయం 9 గంటలకు సమ్మిట్ పూర్తి చేశారు. ఈనెల 18న కింద బేస్ క్యాంప్ కు చేరుతారని శేఖర్ బాబు తెలిపారు. నేపాల్ లో ఈమె సమ్మిట్ కు సంబంధించి రికార్డులు పూర్తి చేసుకుని.. ఈ నెలాఖరుకు వరకు హైదరాబద్ కి చేరుకుంటారని ఆయన వివరించారు.
రాక్ క్లైబింగ్ లో శిక్షకురాలిగా..!
ప్రస్తుతం భువనగిరి (Bhongiri) లోని రాక్ క్లైంబింగ్ స్కూల్ లో శిక్షకురాలుగా పనిచేస్తున్నారు అన్విత. గతంలో సిక్కింలోని రీనాక్, సిక్కింలోని మరో పర్వతం బీసీ రాయ్, కిలి మంజారో, లదాక్ లోని కడే, ఎల్బ్రుస్ పర్వతాలు అధిరోహించారు.
అన్విత అనుకున్నది సాధిస్తుందన్న నమ్మకం ఉందంటున్న తల్లిదండ్రులు
అన్విత ఎంతటి సాహసానికైనా పూర్తి చేసిన నమ్మకం ఉందన్నారు ఆమె తల్లిదండ్రులు. అయినా ఓ సందర్భంలో నాలుగు రోజులు అందుబాటులో రాలేదని తెలిపారు. దీంతో భయమేసిందన్నారు. అయితేట్రాన్సెన్స్ అడ్వెంచర్స్ సంస్థ అధినేత శేఖర్ బాబు కు ఫోన్ చేసిన తర్వాత ధైర్యం వచ్చిందన్నారు పేరెంట్స్. తమ కుమార్తె సాధించిన విజయం తమకు ఎంతో గర్వంగా ఉందని ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.