బర్కత్‌పురాలో యాదాద్రి భవన్ ప్రారంభం.. భక్తులు ఇక్కడ్నుంచీ సేవలు వినియోగించుకోవచ్చు..

దాదాపు రూ.8కోట్లతో 1600 చదరపు గజాల విస్తీర్ణంలో యాదాద్రి భవనం నిర్మాణమైంది. జీ ప్లస్ టూ గా నిర్మించిన ఈ బిల్డింగ్‌లో మొదటి అంతస్తులో కల్యాణ మండపం, రెండో అంతస్తులో 500 మంది సరిపడే భోజనశాలని ఏర్పాటు చేశారు. 10,990 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెల్లార్ ప్రాంతమంతా పార్కింగ్ ఉంటుంది.

news18-telugu
Updated: June 14, 2019, 12:19 PM IST
బర్కత్‌పురాలో యాదాద్రి భవన్ ప్రారంభం.. భక్తులు ఇక్కడ్నుంచీ సేవలు వినియోగించుకోవచ్చు..
బర్కత్‌పురాలో యాదాద్రి భవన్ ప్రారంభం.
news18-telugu
Updated: June 14, 2019, 12:19 PM IST
హైదరాబాద్ బర్కత్‌పురాలో యాదాద్రి భవన్ ప్రారంభమైంది. తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డిలు భవనాన్ని(సమాచార కేంద్రాన్ని) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిమాట్లాడుతూ.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తుల సౌకర్యార్థం యాదాద్రి భవన్ నిర్మించామన్నారు. దీని ద్వారా స్వామివారికి సంబంధించిన ఆర్జిత సేవలు, కల్యాణం, గదుల బుకింగ్ వంటివి ఇక్కడ్నుంచే చేసుకోవచ్చని తెలిపారు.

దాదాపు రూ.8కోట్లతో 1600 చదరపు గజాల విస్తీర్ణంలో యాదాద్రి భవనం నిర్మాణమైంది. జీ ప్లస్ టూ గా నిర్మించిన ఈ బిల్డింగ్‌లో మొదటి అంతస్తులో కల్యాణ మండపం, రెండో అంతస్తులో 500 మంది సరిపడే భోజనశాలని ఏర్పాటు చేశారు. 10,990 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెల్లార్ ప్రాంతమంతా పార్కింగ్ ఉంటుంది.

ఈ కార్యక్రమంలో శాసనమండలి వైస్ చైర్మన నేతి విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయశాఖ కార్యదర్శి అనిల్ కుమార్‌లు పాల్గొన్నారు.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...