పాములంటే పరుగులు పెట్టే ప్రజలే ఎక్కువ మంది ఉంటారు.. అందులో నాగుపామును చూశామంటే ఇక
కాళ్లకు పని చెప్పాల్సిందే.. కాని ఎప్పుడైన పాములు జనావాసంలో కనిపిస్తే అతికొద్ది మాత్రమే
పాములను పట్టి వాటిని సమీపంలోని అటవి ప్రాంతంలో వదిపెడతారు.. ఇందుకోసం కొన్ని క్లబ్బులు
కూడ పనిచేస్తున్నాయి..అయితే ఇలా జనారణ్యంలో కనిపడిన ఓ పామును పట్టడడంతో పాటు ఆ
పాముకు గాయమైంది. వెన్నుపూస విరిగి కదలేని స్థితిలోకి వెళ్లింది. దీంతో దాన్ని గమనించిన ఓ స్నేక్
ప్రియుడు పాముకు ఎక్స్‌రే తీయించి కట్టుకూడా కట్టించాడు.. ఆ తర్వాత దాన్ని అడవిలో వదలిపెట్టాడు.
ఆదివారం వనపర్తి పట్టణం నాగవరంలో ధర్మయ్య అనే వ్యక్తి ఇళ్లు నిర్మాణం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే
పునాది తీస్తుండగా ఓ నాగుపాము కనిపించింది. ఆ తర్వాత వెంటనే దానిపై మట్టి పెడ్డలు పడి
గాయమైంది. దీంతో స్థానికంగా ఉండే స్నేక్ సోసైటి సభ్యుడు కృష్ణసాగర్‌కు ఫోన్ చేశారు. దీంతో అక్కడికి
చేరుకున్న కృష్ణసాగర్ పామును చూశాడు.. గాయంతో ఇబ్బంది పడుతున్న పామును పట్టి స్థానిక
పశువుల వైద్యుడు అంజనేయులు వద్దకు తీసుకుని వెళ్లాడు.
పామును గమనించిన వైద్యుడు పాము ఎముక విరిగినట్టుందని చెప్పాడు.. ఇందుకోసం ఎక్స్ రే
తీయాలని చెప్పాడు. దీంతో స్థానికంగా ఉండే ఓ క్లినిక్‌లో పాముకు ఎక్స్ రే తీయడంతో ఎముక విరిగినట్టు
గుర్తించారు. వెంటనే దానికి సిమెంట్ కట్టు కట్టి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పూర్తైన తర్వాత
సమీపంలోని అడవి ప్రాంతంలో వదిలేస్తాని కృష్ణసాగర్ చెబుతున్నారు. కాగా కృష్ణసాగర్ హోంగార్డుగా పని
చేస్తూనే స్నేక్ సోసైటిని స్థాపించాడు.. ఎక్కడ పాము కనిపించిన ఫోన్ చేసిన వెంటనే వెళ్లి దాన్ని పట్టి
అటవీ ప్రాంతలో వదిలేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.