Home /News /telangana /

WORKERS ARE FACING DIFFICULTIES DUE TO LACK OF VENTILATION AND CLEAN AIR IN PVK 5 INCLINE UNDERGROUND MINE OF BHADRADRI KOTHAGUDEM DISTRICT KMM PRV

Singareni: అదో మాయా ప్రపంచం.. ఆ గనుల్లో ఊపిరి అందదు.. వెంటిలేషన్​ ఉండదు.. నీరు దొరకదు.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. కొత్తగూడెం పీవీకే 5 ఇంక్లైన్ అండర్ గ్రౌండ్ గనిలో కార్మికుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Khammam, India
    (G. Srinivas reddy, News18, Khammam)

    భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా.. కొత్తగూడెం పీవీకే 5 ఇంక్లైన్ అండర్ గ్రౌండ్ గనిలో కార్మికుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పీవీకే 5 ఇంక్లైన్ అండర్ గ్రౌండ్ గనిలో సరైన వెంటిలేషన్ (No ventilation) , మ్యాన్ రైడింగ్ లేకపోవడంతో పని ప్రదేశంలో కార్మికులు (Workers) ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మికులు తాగేందుకు కనీసం నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో, ఆ ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై పడుతుంది.దీంతో కోట్ల రూపాయల మేర సింగరేణి సంస్థ నష్టాలను చవిచూస్తుంది. బెల్ట్ మెయింటెనెన్స్ సక్రమంగా లేకపోవడంతో, వెంటిలేషన్ సమస్య ఉందని పలుమార్లు అధికారులకు చెప్పిన ఫలితం లేదని కార్మికులు వాపోతున్నారు.ఎయిర్ క్రాఫ్ట్స్ వెంటిలేషన్ తలుపులు సరిగా ఏర్పాటు చేయకపోవడంతో కార్మికులు చీకట్లోనే విధులు నిర్వహిస్తున్నామని, ఆ సమయంలో గాలి సరిగా రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని,మ్యాన్ రైడింగ్ లేకపోవడంతో కిలోమీటర్ల మేర కాలి నడకన వెళ్లాల్సి వస్తుందని, దీంతో నిరసించి పోతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    Telangana: తెలంగాణ మంత్రికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. పదవికే ఎసరు రానుందా?

    150 మంది కార్మికులతోనే..

    కాంట్రాక్ట్ కార్మికులకు ప్రమోషన్స్ ఇవ్వాల్సి ఉన్నకూడా, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మైన్ లో కార్మికుల అవసరం ఉన్నా, కాని పైరవీలతో 150 మంది కార్మికులతోనే నెట్టుకొస్తున్నారని, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోగా, ప్రాజెక్టు మైనింగ్ డైరెక్టర్ బలరాం మైన్ ను సందర్శించి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో లాభాలతో కలకలాడిన మైన్ నేడు 100 కోట్ల రూపాయల నష్టంతో నడుస్తున్నదని కార్మిక సంఘాల ఆరోపిస్తున్నాయి.



    ప్రస్తుతం మైన్ లో పనిచేస్తున్న కార్మికుల జీతాలకు సరిపోయే విధంగా బొగ్గు ఉత్పత్తి జరగడం లేదని, ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో 130 కోట్లతో, ప్రైవేట్ సంస్థతో కలిసి పీవీకే 5 ఇంక్లైన్ కంటిన్యూస్ మైనర్ యంత్రాన్ని కొనుగోలు చేసి 11 వందల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 500, 600 టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించి భూగర్భ గని లో వెంటిలేషన్,  మంచినీటి సమస్యలను పరిష్కరించి బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు సరైన చర్యలు తీసుకోవాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నారు..
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bhadradri kothagudem, Singareni Collieries Company

    తదుపరి వార్తలు