హోమ్ /వార్తలు /తెలంగాణ /

Robbery: కరోనా మందులని.. మత్తు మందులు ఇచ్చి.. మత్తులోకి జారిన వెంటనే..

Robbery: కరోనా మందులని.. మత్తు మందులు ఇచ్చి.. మత్తులోకి జారిన వెంటనే..

ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్న పోలీసులు

ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్న పోలీసులు

Robbery: ఓ వైపు కరోనా మహమ్మారి విరుచుకుపడుతంటే.. ఇదే అదునుగా భావించి దొంగలు రెచ్చిపోతున్నారు. కరోనాను అడ్డుపెట్టుకొని అమాయకులను మోసం చేస్తున్నారు. కరోనా మందులు అని చెప్పి మత్తు మందలు ఇచ్చి ఇంట్లో నగదు, విలువైన వస్తువులను అపహరిస్తున్నారు.

ఇంకా చదవండి ...

ఓ వైపు కరోనా మానవత్వాన్ని కనుమరుగు చేస్తోంటే.. మరోవైపు డబ్బుకోసం కొందరు ఎంతటికైనా తెగిస్తున్నారు. కరోనా కాలంలో చాలా మంది ఇబ్బందులకు గురవుతుంటే కొంతమంది వీటిని అదునుగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. వృద్ధ మహిళలనే టార్గెట్ చేస్తు బంగారం, నగదును అపహరిస్తున్నారు. కరోనా టాబ్లెట్స్ అంటూ మహిళలకు మత్తు టాబ్లెట్స్ ఇచ్చి మత్తులోకి జారిన వెంటనే ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దొంగలు దోసుకెళ్తున్నారు. సూర్యాపేట జిల్లా కుడ కుడ గ్రామంలో రెడ్డబోయిన ఎల్లమ్మ (75)వృద్ధ మహిళ పై దుండగులు కరోనా నిర్మూలించే మాత్రలు అని చెప్పి ప్రభుత్వం వారు పంపించారని ఇంటింటికి తిరిగి ఇస్తున్నామని చెబుతూ మత్తు టాబ్లెట్ ఇచ్చారు.

ప్రతీకాత్మక చిత్రం

ఆమె మత్తులోకి జారిన వెంటనే ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. మూడు తులాలన్నర పుస్తెలతాడును అపహరించారు. కరోనాకు వ్యాక్సిన్ మత్రమే వచ్చిందని.. ఇలా కరోనా మందులని ఎవరైనా చెబితే నమ్మవద్దని.. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

First published:

Tags: Corona, Crime, Nalgonda, Robbery, Suryapeta

ఉత్తమ కథలు