హోమ్ /వార్తలు /తెలంగాణ /

Womens Day 2020: స్వాతి లక్రా.. తెలంగాణ మహిళలకు కొండంత ధైర్యం

Womens Day 2020: స్వాతి లక్రా.. తెలంగాణ మహిళలకు కొండంత ధైర్యం

స్వాతి లక్రా

స్వాతి లక్రా

నిత్యం వృత్తి బాధ్య‌త‌ల‌తో బిజీగా ఉండే స్వాతీ ల‌క్రా.. ఫ్యామిలీకి కూడా అంతే సమయం కేటాయిస్తారు. ఇటు వృత్తిని.. అటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో కుటుంబ సభ్యుల సహకారం ఎప్పటికీ మరవలేనిదంటారు లక్రా.

  దేశమంతటా ప్రస్తుతం మహిళల రక్షణపై చర్చ జరుగుతోంది. ఐతే తెలంగాణలో మ‌హిళల‌కు ర‌క్ష‌ణ అంటే ట‌క్కున గుర్తొచ్చేంది షీ టీమ్స్. దాదాపు మూడేళ్ల క్రితం తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మకంగా ప్ర‌వేశ‌పెట్టిన ఈ షీ టీమ్స్ వెనుక ఉన్నది కూడా మహిళే. హైద‌రాబాద్‌లో అర్ధరాత్రి దాటిన అమ్మాయిలు ధైర్యంగా తిరుగుతున్నారంటే దానికి కారణం స్వాత్రి లక్రా. ఆడపడచులకు ఆమె కొండంత అండ..! ఆకతాయిలకు ఆమెను చూస్తే వెన్నులో వణుకు..! నిత్యం మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో విజయవంతమైన షీ టీమ్స్‌కు సక్సెస్‌ఫుల్ లీడర్‌గా పేరుతెచ్చుకున్న స్వాతి ల‌క్రా.. ఎంద‌రో మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. ఆడపిల్ల‌కు త‌ల్లి కావ‌డం వ‌ల‌్లే కాబోలు.. మహిళల భ‌ద్ర‌త ఎంత ముఖ్య‌మో ఆమెకు తెలుసు.

  స్వాతి లక్రా

  తెలంగాణ‌లో షీ టీమ్స్ ఏర్పాటు చేసిన అతి కొద్ది కాలంలోనే దేశానికి ఆద‌ర్శంగా నిలిపారు స్వాతి లక్రా. గ‌డిచిన ఐదేళ్ల‌లో దాదాపు 20 వేల మంది ఆకాతాయిల‌ను క‌ట‌క‌టాల వెన‌క్క పంపించి సూప‌ర్ కాప్‌గా పేరుతెచ్చుకున్నారు. రాంచీలో పుట్టిన స్వాతి ల‌క్రా.. న్యూఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో చదువుకున్నారు. పొలిటిక‌ల్ సైన్స్ అభ్య‌సించ‌డానికి ఢిల్లీకి చేసిన ప్ర‌యాణం.. పూర్తిగా ఆమె దృక్ప‌థాన్నే మార్చేసింది. ఆ ధృక్పథమే ఇప్పుడు హైద‌రాబాద్‌ను మ‌హిళ‌ల‌కు అత్యంత సుర‌క్షిత నగరాల్లో నెంబ‌ర్ వ‌న్‌గా నిలిపింది. 1995లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు స్వాతి లక్రా. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తొలినాళ్లలో త‌న సొంత ప్రాంత‌ంలో పోస్టింగ్ తీసుకున్న ఆమె.. బిఎండీ ఎక్కా (ఐఏఎస్)ని వివాహం చేసుకున్న త‌రువాత హైద‌రాబాద్‌కు బదిలీ అయ్యారు.

  స్వాతి లక్రా ఆలోచ‌న‌ల నుంచి పుట్టిన షీటీమ్స్ ఎంతగా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌యాంటే.. 76శాతం మంది హైద‌రాబాద్ జనాభాకు ఈ షీటిమ్స్‌పై అవగాహన ఉన్నట్టు ఓ ప్రైవేట్ సంస్ధ నిర్వహించిన సర్వేలో తెలింది.

  స్వాతి లక్రా

  తెలంగాణ ప్ర‌భుత్వం ఏ ఉద్దేశంతో అయితే షీ టీమ్స్‌ను ప్ర‌వేశ‌పెట్టిందో అది సఫ‌లీకృతం చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాం. షీ టీమ్స్ వ‌ల‌న గ‌డిచిన ఐదేళ్లల్లో దాదాపు 30% మ‌హిళ‌ల‌పై జ‌రిగే నేరాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. షీ టీమ్స్‌పై ఎంత మేర ప్రజలకు అవ‌గాహన ఉందో తెలుసుకుంటూ.. మ‌హిళ‌ల ప‌ట్ల ఎవ‌రైన అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తే వెంట‌నే చ‌ర్య‌లు తీసుకొనే విధంగా కృషి చేస్తోంది.
  స్వాతీ ల‌క్రా

  స్వాతీ ల‌క్రా బాధ్య‌త‌లు తీసుకునే నాటికి పోలిస్ డిపార్ట్మెంట్‌లో మ‌హిళ‌ల ప్రాతినిధ్యం కేవలం 5 శాతం మాత్ర‌మే. ఆ 5 శాతాన్ని దాదాపు 30 శాతం చేయ‌డంలో స్వాతి లక్రా కీలక పాత్ర పోషించిందంటారు తోటి అధికారులు. ఇక షీ టిమ్స్ ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణ‌ మహిళలకు మ‌రో కొత్త ర‌క్ష‌ణ క‌వ‌చం మ‌హిళ‌ల‌కు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సిటీలో ఉన్న అన్ని కాలేజీల్లో దాదాపు 45 మందితో టీమ్‌లు ఏర్ప‌ాటుచేసి.. ఆ కాలేజీతో పాటు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో మ‌హిళ‌ల భ‌ద్ర‌త బాధ్య‌తను అప్ప‌గించాలని భావిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఐదు కాలేజీల‌ను ఎంపిక చేశారు. అక్కడ విజ‌య‌వంత‌మైతే తరువాత రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లోనూ ఏర్పాటు చేస్తారు.

  స్వాతి లక్రా

  మ‌హిళల ర‌క్ష‌ణ కోసం లక్రా తీసుకొచ్చిన షీ టీమ్స్ ప‌ని చేసే తీరు కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. సిటీలోని రద్దీ ప్రదేశాల్లో షీ టీమ్స్ సభ్యులు మఫ్టీల్లో ఉంటారు. ఎవరైనా మహిళలను వేధింపులకు గురిచేస్తే తమ వద్ద ఉన్న సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేస్తారు. అనంతరం ఆ ఆధారాల‌తో ఆకతాయిలపై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటారు. ఇక నిత్యం వృత్తి బాధ్య‌త‌ల‌తో బిజీగా ఉండే స్వాతీ ల‌క్రా.. ఫ్యామిలీకి కూడా అంతే సమయం కేటాయిస్తారు. ఇటు వృత్తిని.. అటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో కుటుంబ సభ్యుల సహకారం ఎప్పటికీ మరవలేనిదంటారు లక్రా.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Hyderabad, Telangana, Womens Day 2020

  ఉత్తమ కథలు