WOMENS DAY SPECIAL SAJIDA KHAN JOURNEY IN MUSIC AUDIO ENGINEERING FIELD IN MOVIE INDUSTRY SK
Womens Day 2020| దేశంలో తొలి మహిళా ఆడియో ఇంజినీర్.. సజీదా సక్సెస్ స్టోరీ
సజీదా ఖాన్
మ్యూజిక్ ఆడియో ఇంజినీరింగ్ రంగంలో సేవలకు గాను.. కేంద్ర ప్రభుత్వం సజీదా ఖాన్‌ను తొలి ఫిమేల్ మ్యూజిక్ ఇంజినీర్‌గా గుర్తించి మహిళ అవార్డును ప్రదానం చేసింది. జనవరి 2018 లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
అది పూర్తిగా పురుషాధిక్యత ఉన్న రంగం. ఆ రంగంలో ఇప్పటి వరకు ఒక్క మహిళకూడా అడుగు పెట్టలేదు. అదే మ్యూజిక్ ఆడియో ఇంజినీరింగ్. ప్రస్తుతం చాలా మంది మ్యూజిక్ ఆడియో ఇంజినీర్స్ గా పనిచేస్తున్నప్పటికీ.. వారిలో ఒక్క మహిళ కూడా లేరు. ఈ రంగంలో మహిళలేం పనిచేస్తారు అనుకునే ఈ సమాజంలో.. ఎందుకు చేయకూడదంటూ ఓ మహిళ ముందుకొచ్చింది. మ్యూజిక్ ఆడియో ఇంజినీరింగ్ రంగంలో ప్రవేశించిన మొట్టమొదటి మహిళగా నిలవడమే కాకుండా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆమే సజీదా ఖాన్. దాదాపు 14 ఏళ్లుగా ఇదే రంగంలో సజీదా ఖాన్ సేవలు అందిస్తున్నారు. పలు అవార్డు విన్నింగ్ ఫిల్మ్స్ కి ఆడియో ఇంజినీర్‌గా పనిశారు. సినిమా డబ్బింగ్, మ్యూజిక్ ఆడియో మిక్సింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యాజిక్ మిక్సింగ్ ల్లో సజీదా ఖాన్‌కు అనుభవం ఉంది. ఇప్పటి వరకు దాదాపు 100 పైగా తెలుగు, తమిళ్, మలళాలం, భోజ్‌పురి సినిమాలకు మ్యాజిక్ ఇంజినీర్‌గా పని చేశారు సజీదా ఖాన్.
సజీదా ఖాన్
పదోతరగతి పూర్తయిన తరువాత నేను మల్టీమీడియా నేర్చుకున్నా. ఆ సమయంలో శ్రీనగర్ కాలనీలో ఉన్న ఒక మ్యూజిక్ స్టూడియో కి స్నేహితులతో కలిసి వెళ్లాను. ఆ స్టూడియో చూసిన తరువాత.. తనకు నచ్చిన ఈ రంగంలోకి వస్తే బాగుంటుందని అనుకున్నా. ఇంటర్ పూర్తయ్యాక ఒక హాబీలా మాత్రమే జాయిన్ అయ్యాను. రాను రాను ఇందులో లోతుకు వెళ్లేకొద్దీ ఈ రంగంపై ఇష్టం పెరిగింది. అలా ఇందిలో సౌండ్ ఇంజినీరింగ్‌లోని అన్ని విభాగాల్లో పట్టు సాధించాను.
— న్యూస్ 18 తో సజీదా ఖాన్.
రాష్ట్రపతి అవార్డు అందుకున్న సజీదా ఖాన్
మ్యూజిక్ ఆడియో ఇంజినీరింగ్ రంగంలో సేవలకు గాను.. కేంద్ర ప్రభుత్వం సజీదా ఖాన్‌ను తొలి ఫిమేల్ మ్యూజిక్ ఇంజినీర్‌గా గుర్తించి మహిళ అవార్డును ప్రదానం చేసింది. జనవరి 2018 లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు సజీదా ఖాన్. అంతేకాదు రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డు, తెలంగాణ మహిళ వశిష్టా అవార్డులను కూడా ఆమె సొంతం చేసుకున్నారు. సినీ పరిశ్రమల్లోని ఎంతో మంది ప్రముఖ సంగీత దర్శకులు, దర్శకులతో ఆమె పనిశారు. దాసరి నారాయణ రావు, పూరీ జగన్నాథ్, తేజ సహా పలువురు సినమాలకు ఆడియో ఇంజీనీర్గా సజీదా ఖాన్ పని చేశారు.
సజీదా ఖాన్
“నాకు 2015 లో తొలి అవార్డు వచ్చింది. ఇప్పటి వరకు చాలా అవార్డుల, రివార్డులు వచ్చాయి. నాకు వచ్చిన ప్రతి అవార్డు చాలా గొప్పదే. ఇలా అవార్డులు తీసుకోవడానికి పలు ప్రాంతాలు వెళ్లేటప్పుడు చాలా మందిని కలుస్తాను. అలా కలుసుకోవడం చాలా విషయాలను నేర్పిస్తుంది. అది ఈ అవార్డుల కంటే గొప్ప అనుభూతిని అందిస్తుంది.” అని నవ్వుతూ సౌండ్ ఇంజినీరింగ్ రంగంలో తన ప్రయాణాన్ని న్యూస్18 తో పంచుకున్నారు సజీదా ఖాన్.
సజీదా ఖాన్
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.