WOMENS CELEBRATED VARALAKSHMI VRATHAM IN JOINT ADILABAD DISTRICT SNR ADB
Varalakshmi Vratham 2022: శ్రావణమాసం రెండో శుక్రవారమే వరలక్ష్మీ వ్రతం చేయడానికి ప్రత్యేకత..?
Varalakshmi Vratham 2022
Varalakshmi Vratham 2022: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తం ప్రజలు వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అయితే ఈసారి కూడా ప్రజలు వైభవంగా వ్రతాన్ని జరుపుకున్నారు. మహిళలు పరస్పరం వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
(K.Lenin,News18,Adilabad)
ఉమ్మడి ఆదిలాబాద్(Adilabad)జిల్లా వ్యాప్తం ప్రజలు వరలక్ష్మీ వ్రతాన్ని(Varalakshmi Vratham)భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం(Friday)రోజున ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అయితే ఈసారి కూడా ప్రజలు వైభవంగా వ్రతాన్ని జరుపుకున్నారు. మహిళలు పరస్పరం వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. వరలక్ష్మీవ్రతం సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. ఆయా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
సౌభాగ్యం వరాలు ప్రసాదించమని...
శ్రావణమాసం అందులో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేసుకోవాన్ని మహిళలు పవిత్రంగా భావిస్తారు. శ్రావణమాసం రెండో శుక్రవారం రోజున భక్తి, శ్రద్ధలతో సంప్రదాయం ప్రకారం వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తే సౌభాగ్యంతో పాటు సుఖ,సంతోషాలు కలుగుతాయని మహిళలు భావిస్తుంటారు. ఇందులో భాగంగానే తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. భనిర్మల్ జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం సరస్వతి ఆలయంలో కొలువున్న అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
సామూహిక వరలక్ష్మీ వ్రతాలు.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పలు గ్రామాల్లో మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మీవ్రతాన్ని ఆచరించారు. ఇందులో భాగంగా జైనథ్ మండలంలోని పెండల్ వాడ గ్రామంలోని మహా లక్ష్మి ఆలయానికి గ్రామ మహిళలు మంగళ హారతులతో తరలి వచ్చి వ్రతాన్ని ఆచరించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు మహాలక్ష్మీ అమ్మవారికి ఉదయం అభిషేకం చేశారు. అనంతరం ఆలయంలో మహిళలు సామూహికంగా వ్రతాన్నిచేసుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సౌభాగ్యం ప్రసాదించమని కోరుకున్నారు. పాడిపంటలతో తులతూగాలని, గ్రామంలోని కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని మహిళలు ఆకాంక్షించారు.
ఆలయాలకు శ్రావణశోభ..
జిల్లాలోని తాంసి, భీంపూర్ మండలల్లోని గ్రామ గ్రామన మహిళలు వరాలు కురిపించే తల్లి వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తాంసి మండల కేంద్రంలోని రామేశ్వరాలయంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయ పూజారి జూకంటి సతీష్ శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు ఆజీవనాంతం సౌభాగ్యం, సంపద ప్రసాదించాలని ఆ తల్లిని వేడుకున్నారు.
భక్తి, శ్రద్ధలతో ..
తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వరలక్ష్మీ వ్రత పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కళ్యాణ్ మాట్లాడుతూ శ్రావణ మాసంలో రెండో శుక్రవారం రోజున లక్ష్మీ దేవివ్రతం ఆచరించి, ఆ లక్ష్మీ దేవిని మహిళలు పూజించడం, ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారమని అన్నారు. కొత్తగా పెళ్లయిన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించాలని, లక్ష్మీదేవి కృపాకటాక్షంతో సౌభాగ్యం, ధనం, ధాన్యం, ఆరోగ్యంతో కుటుంబం విరాజిల్లుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు, భక్తులు పాల్గొన్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.