హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kalvakuntla Kavitha: మహిళలు వెనకడుగు వేయొద్దు.. సోషల్ మీడియా వేధింపులపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు

Kalvakuntla Kavitha: మహిళలు వెనకడుగు వేయొద్దు.. సోషల్ మీడియా వేధింపులపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు

కార్యక్రమంలో మాట్లాడుతున్న కవిత

కార్యక్రమంలో మాట్లాడుతున్న కవిత

Kalvakuntla Kavitha: మహిళలకు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురైతే వాటిని తొలగించకుండా ఆధారాలతో వారి‌ మీద ఫిర్యాదు చేయాలని కవిత సూచించారు.

తెలంగాణ మహిళలకు ఎక్కడ వేధింపులు ఎదురైనా ధైర్యంగా ఫిర్యాదు చేస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళల రక్షణ ‌కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసిందని ఆమె తెలిపారు. హైదరాబాద్‌లో ట్రూ కాలర్, నెట్‌వర్క్18 (Network 18) ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక మాధ్యమాల్లో (Social Media)మహిళలు వేధింపులపై గళమెత్తడం అనే అంశంపై జాతీయస్థాయి అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత(Kalvakuntla Kavitha) పాల్గొన్నారు. మహిళల రక్షణతో పాటు, ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని కవిత తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్, డబుల్ బెడ్ రూం ఇండ్ల లాంటి అనేక పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత లభిస్తోందని అన్నారు. వారి పేరు‌ మీదనే ఈ పథకాలు అమలు జరుగుతోందని..లబ్ధిదారులకు ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు.

తెలంగాణలో ఇటీవల మహిళా జూనియర్ లైన్ మెన్ నియామకం అవడాన్ని ఈ సందర్భంగా కవిత గుర్తు చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం మహిళలకు ఇంటర్నెట్ మరింతగా అందుబాటులోకి వస్తే మహిళలకు ఆర్థిక అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. గ్రామాల్లో ఉపాధి కోసం బీడీలు చుడుతున్న మహిళలు, ల్యాప్‌టాప్‌లో పనిచేసే రోజులు రావాలని ఆమె ఆకాంక్షించారు.

మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో షీ టీమ్‌లు ఏర్పాటు చేసిందని కవిత వివరించారు. షీ టీమ్‌లతో పాటు మహిళా పోలీసు స్టేషన్‌లు, స్పెషల్ సైబర్ సెల్ సైతం ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలపై సైబర్ వేధింపులకు ప్రత్యేక చట్టాలు ఉంటే మరింత వేగంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు.

KCR| BJP: కేసీఆర్ ఆ విషయంలో ఫిక్స్ అయ్యారా ?.. బీజేపీ కూడా అలాగే ఆలోచిస్తోందా ?

T Congress: తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయాలు.. వారికి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

మహిళలకు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురైతే వాటిని తొలగించకుండా ఆధారాలతో వారి‌ మీద ఫిర్యాదు చేయాలని కవిత సూచించారు. అలాంటప్పుడు తక్షణం కఠిన చర్యలు తీసుకునే అవకాశం లభిస్తుందని కవిత అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో వేధింపులపై ఫిర్యాదు చేయడానికి మహిళలు వెనకడుగు వేయొద్దని ఆమె మహిళలకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ ఎడిటర్ మార్యా షకీల్ మోడరేటర్‌గా వ్యవహరించారు.

First published:

Tags: Kalvakuntla Kavitha, Social Media

ఉత్తమ కథలు